రజినీకాంత్ మ్యానియాను లెక్క చేయకుండా  హీరో  శ్రీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆపరేషన్ 2019’ విజయం సాధించింది అంటూ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆసినిమా దర్శకుడు బాబ్జీ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన అనేక విషయాల పై సంచనల వ్యాఖ్యలు చేసాడు. 2007లో విడుదలై విజయం సాధించిన ‘ఆపరేషన్ దుర్యోధన’ చిత్రానికి   సీక్వెల్ గారూ పొందించిన ఈమూవీ విజయవంతం అయింది అంటూ ఈమూవీ యూనిట్ అభిప్రాయం వ్యక్త పరుస్తోంది. 
అన్నీ ముద్దుల సినిమాలే
వాస్తవానికి ఈసినిమాకు డివైడ్ టాక్ వచ్చినా పూర్తి స్థాయిలో రాజకీయ అంశాలతో తెరకెక్కించిన ఈచిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోందని ఈమూవీ దర్శకుడు అభిప్రాయ పడుతున్నాడు. ఈసినిమాను చూసిన ప్రతి వ్యక్తి ఈమూవీ బాగుందని కామెంట్ చేస్తున్నాడని అందువల్ల ఈమూవీ పై నెగిటివ్ ప్రచారం చేయవద్దు అంటూ ఈమూవీ దర్శకుడు మీడియాకు విజ్ఞప్తి చేసాడు. 
మాసిన గడ్డం అంటే
దేశ భవిష్యత్తు యువత చేతుల్లో కాదు ఓటర్ చేతుల్లో ఉందనే పాయింట్ తో నిర్మింపబడ్డ ఈసినిమాలో పవన్ నటించి ఉంటే బాగుండేది అని వస్తున్న కామెంట్స్ గురించి స్పందిస్తూ ఈ డైరెక్టర్ తన లాంటి కొత్త వ్యక్తులను పవన్ కళ్యాణ్ లాంటి టాప్ హీరోలు నమ్మరు కదా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.  అంతేకాదు ఈసినిమాలో ఒక సందర్భంలో వచ్చే డైలాగ్ మాసిన గడ్డంతో వెళితే ఓట్లు పడవు అనే డైలాగ్ పవన్ కళ్యాణ్ పై అని అనుకుంటున్నారని ఆ డైలాగ్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వ్రాయలేదని సినిమాలోని సన్నివేశాన్ని అర్ధం చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నాడు దర్శకుడు బాబ్జీ. 
అన్నీ ముద్దుల సినిమాలే
ఇదే సందర్భంలో ప్రస్తుత తరం ప్రేక్షకుడు ముద్దులతో సీన్స్ ఉంటేనే సినిమాలు చూస్తారు అని చాలామంది అభిప్రాయ పడుతూ ఉండటం తనకు ఆశ్చర్యంగా ఉంది అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు ఈ డైరెక్టర్. ప్రస్తుతం నెలకొన్న ఎన్నికల వాతావరణానికి తగ్గట్లుగా మంచి సినిమాను తీసినా కనీసం మీడియా నుండి కూడ తనకు సరైన సహకారం రావడం లేదని ఈసినిమాను చూసి కనీసం 20 మంది ఓటర్లు మారినా చాలా బావుంటుందని అంటూ ఈమూవీ దర్శకుడు అదేవిధంగా శ్రీకాంత్ చేసిన కామెంట్స్ ప్రస్తుత తరం ప్రేక్షకులు పట్టించుకుంటారా అన్నదే ప్రశ్న..   


మరింత సమాచారం తెలుసుకోండి: