టాలీవుడ్ లో నందమూరి హీరోలు అంటే ప్రత్యేక ఇమేజ్ ఉంది.  మహానటులు సీనియర్ ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ హీరోగా ఇప్పటి వరకు వందకు పైగా సినిమాల్లో నటించారు.  ఇప్పటికీ ఆయన సినిమాలంటే ఎంతో క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా నందమూరి హీరోలు అంటే మాస్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు.  ఇక స్వర్గీయ నందమూరి హరికృష్ణ తనయులు నందమూరి కళ్యాన్ రామ్, జూ.ఎన్టీఆర్ లు హీరోలుగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచారు.  టెంపర్ సినిమా నుంచి మొన్నటి అరవింద సమేత వరకు వరుస విజయాలు అందుకుంటున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. 
Image result for kalyan ram kla
అయితే నటుడిగా, నిర్మాతగా తన సత్తా చాటుతున్నాడు కళ్యాన్ రామ్.  ఆ మద్య ‘పటాస్’తో మంచి విజయం అందుకున్నాడు కళ్యాన్ రామ్. ఈ మ‌ధ్యే త‌మ‌న్నాతో క‌లిసి న‌టించిన "నా నువ్వే".. కాజ‌ల్‌తో "ఎమ్మెల్యే" మూవీస్ బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.  ఇలా వరుసగా పరాజయాలు పొందుతున్న కళ్యాన్ రామ్ ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన వున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ సినిమాటోగ్రఫర్ కేవీ గుహన్ వినిపించిన కథ నచ్చడంతో, ఆయనతో సినిమా చేశాడు.

సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా నిర్మితమైంది. రీసెంట్ గా ఈ సినిమాకి '118' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాకు సంబంధించి టైటిల్ లోగోను ఈ రోజు విడుదల చేశారు.  చిత్రీక‌ర‌ణ దాదాపుగా పూర్త‌యింది. ప్ర‌స్తుతం నిర్మాణాన‌రంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. జ‌న‌వ‌రి 2019న ఈ సినిమా విడుద‌ల కానుంది. 

ఈ ఫస్ట్ లుక్‌లో కళ్యాణ్ రామ్ 8 అంకెలో ఉన్న ఫోటో చాలా అట్రాక్టివ్‌గా ఉంది. ‘118’ అనే టైటిల్ వెనక ఉన్న రహస్యం ఏంటో చూడాలి. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ సరసన నివేదా థామస్, షాలినీ పాండేలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ఫై మహేష్ కోనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.  మ‌రోసారి క‌ళ్యాణ్ రామ్‌తో ‘118’ సినిమాను నిర్మిస్తున్నాడు.
 



మరింత సమాచారం తెలుసుకోండి: