తెలుగు ఇండస్ట్రీలో ‘రంగస్థలం’లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను,  మెగా పవర్ స్టార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘వినయ విధేయ రామ’.  ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి అన్ని విషయాలు సీక్రేట్ గా మేయింటేన్ చేశారు. ఈ మద్య ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ కూడా రిలీజ్ చేశారు.  సోషల్ మీడియాలో టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.  మొదటి సారి కలిసిన ఈ కాంబో పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీ ఎత్తున ఉన్నాయి. అంతే కాదు ఈ చిత్రంపై  కొన్ని నెగిటివ్ కథనాలు వస్తున్న తరుణంలో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేయాలనీ చిత్ర ప్రమోషన్ డోస్ పెంచింది.  


ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి ఒక లిరికల్ సాంగ్ వీడియోను విడుదల చేశారు. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన 'తందానే.. తందానే'  అనే ఈ సాంగ్ చూస్తుంటే బోయపాటి స్టైల్ మరోసారి రెగ్యులర్ గానే ఉన్నట్లు అనిపిస్తోంది.. శ్రీమణి సాహిత్యం బాగున్నాయి. 


ఒక ఫ్యామిలీతో హీరో.. వారిలో హీరోయిన్ అండ్ ట్రెడిషినల్ సాంగ్.. ఈ స్టైల్ లో గతంలో బోయపాటి చిత్రాల్లో సాంగ్స్ కనిపించిన సంగతి తెలిసిందే.  ఈ పాట చూస్తుంటే.. పండుగ వాతావరణంలో సాగే ఫ్యామిలీ సాంగ్ గా ఈ పాట చిత్రీకరణ జరిగినట్టుగా అర్థమవుతోంది. బోయపాటి మార్క్ తో ఈ పాట తెరపై నిండుగా కనిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. స్నేహ .. ప్రశాంత్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. 


యాక్షన్ సీన్.. ఎమోషనల్ సీన్ ఇలా ఏదైనా కరెక్ట్ టైమింగ్ లో ఈ దర్శకుడు ప్రేక్షకుడి అభిరుచుకి తగ్గట్టు వాడుకుంటాడు. ఇక బోయపాటి మార్క్ యాక్షన్ సీన్స్ కు కొదవలేదని తెలుస్తోంది. రామ్ చరణ్ సరసన కైరా అధ్వాని హీరోయిన్ గా నటిస్తుండగా ఆర్యన్ రాజేష్ - ప్రశాంత్ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: