ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సిద్దార్థ్ హీరోగా ‘బాయ్స్’సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది అందాల భామ జెనీలియా డిసౌజా.  ఆ తర్వాత సిద్దార్థ్ హీరోగా ‘బొమ్మరిల్లు’ సినిమా ఆమెను తిరుగులేని కథానాయికను చేసింది. ఆ సినిమాలో హాసిని పాత్రలో అచ్చం తెలుగింటి అమ్మాయిలానే నటించింది.  ఈ సినిమాలో డైలాగ్ ‘వీలైతే కప్పు కాఫీ.. నాలుగు మాటలు’యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది..ఇప్పటికీ కొంత మంది ఆ డైలాగ్స్ వాడుతూనే ఉంటారు. తెలుగుతో పాటు, తమిళం, హిందీ సినిమాల్లో నటించింది.   
Image result for genelia d'souza age
జెనీలియా ‘తేరే నాల్ లవ్ హోగయా’సినిమాలో నటించిన సహ నటుడు  రితేష్ దేశ్‌ముఖ్‌తో ప్రేమలో పడటమే కాదు..పెళ్లి కూడా చేసుకుంది. రాజకీయం, సినిమా నేపథ్యంగల ఇంటికి కోడలయ్యింది.  కళ్లతోనే మాట్లాడగలిగే హీరోయిన్ గా  పేరు తెచ్చుకున్న జెనీలియా, వివాహం తరువాత నటనకు దూరమైంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన జెనీలియా .. ఇప్పుడు మళ్లీ నటనపై దృష్టి పెట్టింది. ఇటీవలే 'మౌలి' అనే మరాఠీ సినిమాలో తన భర్త రితేష్ దేశ్ ముఖ్ తో కలిసి ఒక సాంగ్ లో మెరిసింది.
Image result for ritesh deshmukh jeleya
సల్మాన్ ఖాన్ నటించిన ‘జైహో’ సినిమాలో వికలాంగురాలిగా నిడివి తక్కువగల పాత్రలో నటించింది. ఇప్పుడు తన స్థాయికి తగ్గ పాత్రలు వస్తే దక్షిణాది సినిమాల్లోనూ నటిస్తానని ఓ స్టేజ్ మీద చెప్పింది.  ఇకప్పుడు హీరోయిన్ గా నటించినవారు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే.  మన దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదించి మళ్ళీ జెనీలియాను తెలుగు తెరపైకి తెస్తారని తెలుస్తోంది. దీనిని బట్టి జెనీలియా తెలుగు తెరపై మళ్లీ కనిపించే అవకాశాలు వున్నాయనే అనిపిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: