శ్రీకాకుళం జిల్లా రాజాంలో పాదయాత్ర చేస్తున్న జగన్ పవన్ మూడు పెళ్ళిళ్ళ వ్యవహారాన్ని మళ్ళీ తెర పైకి తీసుకు వచ్చి చేసిన ఘాటైన వ్యాఖ్యలు పవన్ వీరాభిమానులకు మితిమీరిన కోపంతో పాటు టెన్షన్ ను కూడ కలిగిస్తున్నాయి.  పవన్ నాలుగేళ్లకొకసారి భార్యను మార్చేస్తాడు అంటూ పెళ్ళి అనే పవిత్రమైన వ్యవస్థను పవన్ రోడ్డు మీదకు తీసుకువచ్చి నిత్య పెళ్ళి కొడుకులా మారిపోయాడు అంటూ జగన్ చేసిన కామెంట్స్ పెను సంచలనాలను సృష్టిస్తున్నాయి. 

అంతేకాదు పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ తన బాధను వ్యక్త పరుస్తూ ఆమధ్య కొన్ని కామెంట్స్ చేసినప్పుడు ఆమె పై పవన్ అభిమానుల మాటల దాడి విపరీతంగా జరిగి ఆమె అనేక వేధింపులకు గురైతే పవన్ ఈవిషయాన్ని చోద్యం చూస్తూ ఎంజాయ్ చేసాడు అంటూ జగన్ తీవ్ర విమర్శలు చేసారు. ఈ కామెంట్స్ తో తిరిగి పవన్ వ్యక్తిగత జీవితం పై సాధారణ ప్రజలు కూడ చర్చలు చేసుకునే స్థాయికి తీసుకు వెళ్ళింది. 

దీనితో ఒకసారి పవన్ కళ్యాణ్ వ్యకతిగత జీవితం పై విమర్శలు చేసి ఆపై అటువంటి కామెంట్స్ చేయకుండా జాగ్రత్త పడిన జగన్ మళ్ళీ పవన్ ను ఎందుకు టార్గెట్ చేసాడు అన్న కోణంలో ఇప్పుడు రాజకీయ వ్ర్గాలలోనే కాకుండా ఫిలిం ఇండస్ట్రీ వర్గాలలో కూడ తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికల తరువాత పవన్ జగన్ లు ఎకమైపోతారు అంటూ వస్తున్న వార్తలకు జగన్ స్పష్టమైన క్లారిటీ ఇవ్వడానికి ఇలా మళ్ళీ పవన్ వ్యక్తిగత జీవితం పై కామెంట్ చేసి ఉంటాడు అన్న అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

దీనికితోడు కాపు సామాజిక వర్గం బాగా ఉండే ఉభయ గోదావరి జిల్లాలలో అదేవిధంగా విశాఖపట్టణం శ్రీకాకుళం జిల్లాలలో పవన్ తరుచు తన ‘ప్రజా పోరాట యాత్ర’ పేరుతో వరస పర్యటనలు చేస్తున్న నేపధ్యంలో ఆ పర్యటనల ప్రభావం తన పార్టీ ఓటు బ్యాంక్ కు ఎక్కడ హానీ చేస్తుందో అన్న ఉద్దేశ్యంతో జగన్ మళ్ళీ పవన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పెళ్ళిళ్ళ వ్యవహారాన్ని తెర పైకి తీసుకు వచ్చి ఉంటాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా తిరిగి పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళ పై చర్చలు జరగడం పవన్ ఇమేజ్ కి ఏమాత్రం మంచిది కాదు అన్న టెన్షన్ లో పవన్ వీరాభిమానులు ఉన్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: