‘భాగమతి’ తరువాత అనుష్క ఏ సినిమాను అంగీకరించలేదు. ఆమధ్య రెండు తమిళ సినిమాలకు అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆతరువాత ఆమూవీ ప్రాజెక్ట్ ల నుండి ఆమె తప్పుకోవడంతో అనుష్క సినిమాలను పక్కకు పెట్టి పెళ్లి విషయం పై తీవ్ర ఆలోచనలు చేస్తోంది అంటూ అనేక వార్తలు వచ్చాయి. 
చంద్రశేఖర్ ఏలేటి సినిమాతో
అయితే ఆ గాసిప్పులకు చెక్ పెడుతూ అనుష్క తీసుకున్న షాకింగ్ ‘సీక్రెట్’ నిర్ణయం పై ఒక ఆసక్తికర కథనం ఇప్పుడు మీడియా లీక్ చేసింది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్నట్లు సమాచారం. చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వం వహించే ఈమూవీకి కోన వెంకట్ కథను సమకూరుస్తున్నట్లు సమాచారం. 
బరువ తగ్గేందుకు ఆస్ట్రేలియాకు
ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే ఈ మూవీకి ‘సీక్రెట్’ అన్న టైటిల్ పెడితే బాగుంటుందని భావిస్తున్నట్లు టాక్. సాధారణంగా చంద్రశేఖర్ ఏలేటి సినిమాలు చాల వైవిధ్యంగా ఉంటాయి కాబట్టి అదే కోవలో ఎవరూ ఊహించని ఒక కొత్త తరహా స్క్రీన్ ప్లే తో ఈమూవీ నిర్మాణం ఉంటుందని సమాచారం. 
హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో
పూర్తిగా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీగా నిర్మాణం జరుపుకుని ఈమూవీలో కథ పూర్తిగా అనుష్క చుట్టూ తిరుగుతుందని సమాచారం. ఈమధ్య అనుష్క లావు సమస్య నుండి  బయటపడటానికి ఆస్ట్రేలియాకు వెళ్లినట్టు వార్తలు వచ్చాయి. ఆతరువాత ఆమె ఎక్కడా ఫిలిం ఫంక్షన్స్ లో కనిపించలేదు. దీనితో ప్రస్తుతం అనుష్క ఆకారం ఎలా ఉంది అన్న విషయమై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. దీనికితోడు ఇప్పుడు ఈమె నటిస్తున్న సినిమా టైటిల్ కూడ ‘సీక్రెట్’ కావడం యాదృశ్చికం అనుకోవాలి..    



మరింత సమాచారం తెలుసుకోండి: