ఇప్పటికే రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చుకున్న రామ్ గోపాల్ వర్మ ‘బైరవగీత’ వాయిదా వెనుక బయటపడని చాల కారణాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈమూవీ ‘2.0’ సునామీని లెక్క చేయకుండా గతవారం విడుదల కావలసి ఉంది. అయితే ఆఖరి నిముషంలో రామ్ గోపాల్ వర్మ ఈమూవీని వాయిదా వేయడం వెనుక ‘2.0’ మూవీ సునామీ కాదనీ ఈమూవీకి ఎదురైన సెన్సార్ సమస్యలు అని వార్తలు వస్తున్నాయి. 

ఈమూవీలో సెన్సార్ సభ్యులు ఆశ్చర్యపోయే విధంగా న్యూడ్ సీన్స్ విపరీతంగా ఉన్నాయని దీనికితోడు విపరీతమైన సంఖ్యలో ఈమూవీలో బూతు డైలాగులు ఉన్నట్లు సమాచారం. ‘అర్జున్ రెడ్డి’ ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాల మాదిరిగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని వర్మ ప్రత్యేకమైన శ్రద్ధతో ఈన్యూడ్ సీన్స్ విషయానికి తెర తీసినట్లు తెలుస్తోంది. 

వర్మ శిష్యుడు సిద్ధార్థ తెరకెక్కించిన `భైరవగీత`లో సీమ మనోభావాల్ని దెబ్బ తీసే అంశాలున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రాయలసీమ లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ ప్రేమ కథా చిత్రంలో కన్నడ నటుడు ధనంజయ- ఇర్ర మోర్ ఈమూవీలో చాల హాట్ సీన్స్ లో నటించి నటనలో జీవించడంతో ఆఇద్దరి మధ్యా న్యూడిటీ విమర్శలకు తావిస్తుందని సెన్సార్ తీవ్ర అభ్యంతరాలు చెప్పినట్లు టాక్. 

దీనితో ఈసినిమా ఈవారం కూడ విడుదల కాదనీ వచ్చే వారం డిసెంబర్ 14కు వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వర్మ తాను తీసిన సినిమాలు వల్ల ఆర్ధిక సమస్యలు ఎదుర్కుంటున్న నేపధ్యంలో ఈ సమస్యల నుండి బయటపడటానికి యూత్ ను టార్గెట్ చేస్తూ ‘బైరవగీత’ లో ఊహించని స్థాయిలో హాట్ సీన్స్ పెట్టారని సమాచారం..  


మరింత సమాచారం తెలుసుకోండి: