ఏ సినిమాకైనా కధ, కధనాలు, హీరోయిజం ఎంత ముఖ్యమో అంతకంటే ఎక్కువగా గ్లామర్ కూడా ప్రధానమే. హీరో ఎవరన్న దాంతో పాటు హీరోయిన్ల జోడీని కూడా జనం చూస్తున్నారు. అపుడే ధియేటర్లకు వెళ్తున్నారు. విషయానికి వస్తే ఈ నెల 7వ్ విడుదల అవుతున్న కవచం మూవీకి గ్లామర్ డోస్ ఎక్కువగా ఉందని టాక్. ఒకరు కాదు ఇద్దరు ముద్దు గుమ్మలు ఆడి పాడి ఆనందపరుస్తారట.


ఒకరేమో జిల్ జిల్ జిగేల్ రాణి కాజల్ ఈ చిత్రంలో మైన్ ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. అలాగే సెకండ్ హీరోయిన్ గా మెహ్రిన్ తన సోయగాలతో సందడి చేయనుంది. . ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్లో కూడా ఈ ఇద్దరు భామలు హల్ చల్ చేయడంతో హైప్ బాగా పెరిగింది. కాజల్ సైతం గ్లామర్ గా కనిపించడం విశేషం.


ఈ మూవీలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో ఇద్దరు హీరోయిన్లు చేసే రొమాన్స్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని గట్టి నమ్మకంతో ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు. ఈ మూవీ హిట్ అని అపుడే ఇన్నర్ సర్కిల్లో వినిపిస్తున్న మాట. మంచి ఎనర్జీతో శ్రీనివాస్ చేసిన ఈ మూవీ లవ్ అండ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రాబోతొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: