గత కొంతకాలంగా మౌనంగా ఉంటున్న రేణుదేశాయ్ ఈరోజు ఎవరు ఊహించని విధంగా అకిరా నందన్ స్టైలిస్ట్ లుక్ కు సంబంధించిన లేటెస్ట్ ఫోటో ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి పవన్ అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చింది. ఈ ఫోటోను రేణు దేశాయ్ పోస్ట్ చేసిన కొద్ది గంటలలోనే అది వైరల్ గా మారిపోయింది. 
నా పిల్లలు ఎంజెల్స్
అంతేకాదు అకిరానందన్ ఫోటో పై రేణు చేసిన కామెంట్స్ కూడ పవన్ అభిమానులకు బాగా కనెక్ట్ అవుతున్నాయి. ‘ఫొటోల్లో నా పిల్లలు అందంగా కుదిరిపోతారు. అలాంటి పిల్లలని ఫోటోలు తీయడం ఎడిట్ చేయడం లాంటి అంశాలు నాకు చాలా బాగా అనిపిస్తాయి. అకీరా, ఆధ్య నేను కోరిన విధంగా ఓపికగా ఫోటోలకు ఫోజులు ఇస్తారు. నా పిల్లలు ఏంజెల్స్’ అంటూ రేణు దేశాయ్ దేశాయ్ తన పిల్ల పై ప్రసంసలు కురిపిస్తూ వారిని ఆకాశానికి ఎత్తేసింది.
కొత్త జీవితంలోకి
ఇప్పటికే అకీరాని పవన్ వీరాభిమానులు  జూనియర్ పవర్ స్టార్ అని పిలవడం ప్రారంభించిన నేపధ్యంలో రేణు పోస్ట్ చేసిన పిక్ పై అభిమానులు రకరకాలుగా కామెంట్స్ వేస్తున్నారు. అకిరా అచ్చు పవన్ కళ్యాణ్ లా కనిపిస్తున్నాడు అంటూ తమ జూనియర్ పవర్ స్టార్ ఫోటో పై ప్రశంసలు కురిపిస్తున్నారు. 
 అలా పిలవడం ఇష్టం లేదు
అయితే రేణు దేశాయ్ మాత్రం తన కొడుకుని పవన్ అభిమానులు జూనియర్ పవర్ స్టార్ అంటూ కామెంట్స్ చేయడం తనకు ఇష్టం లేదు అంటూ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈమధ్య రేణు దేశాయ్ పెళ్లి విషయంలో పవన్ అభిమానుల నుండి తీవ్ర విమర్శలు వచ్చిన తరువాత ఇప్పుడు ఇలా తిరిగి ఆమెను ఎటువంటి కామెంట్స్ చేయకుండా రేణుదేశాయ్ కామెంట్స్ ను ప్రశంసిస్తూ పవన్ అభిమానులు చేస్తున్న హడావిడి చూసిన వారికి రేణు పై పవన్ అభిమానుల కోపం బాగా తగ్గింది అనుకోవాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: