సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా కాజల్ దశాబ్ధ కాలం నుండి కెరియర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తుంది. మొన్నామధ్య కెరియర్ దాదాపు ముగిసింది అనుకునే టైంలో అమ్మడికి లక్కీ ఆఫర్లు వచ్చాయి. ఖైది నంబర్ 150 సినిమా కాజల్ కెరియర్ ఊపందుకునేలా చేసింది. ఇక ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలను అందుకుంది.


సినిమా సినిమాకు కాజల్ క్రేజ్ డబుల్ అవుతుంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలు ఉన్న ఈ అమ్మడు శంకర్, కమల్ కాంబినేషన్ లో వస్తున్న ఇండియన్-2 లో ఛాన్స్ కొట్టేసింది. ఇండియన్ సినిమా ప్రకంపణలు తెలిసిందే. శంకర్, కమల్ ఇద్దరు కలిసి అద్భుతాన్ని సృష్టించారు. రెండు దశాబ్ధాల తర్వాత ఆ సినిమా సీక్వల్ తీస్తున్నారు.


ఈమధ్యనే 2.ఓతో తన సత్తా చాటిన శంకర్ ఇండియన్-2ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ముహుర్త కార్యక్రమాలు పూర్తవగా జనవరిలో ఇండియన్-2 రెగ్యులర్ షూటింగ్ కు వెళ్తారట. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే కమల్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఇండియన్-2 సినిమాలో కాజల్ సీనియర్ సిటిజెన్ కు పెయిర్ గా నటిస్తుందా లేక యువ హీరో పక్కన నటిస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.


ఇండియన్ సినిమాలో సుకన్య లాంటి పాత్రలో అయితే కాజల్ ను అలా ఓల్డ్ గెటప్ లో చూడగలుగుతామా అన్నది అభిమానుల్లో కంగారు మొదలైంది. కాజల్ లాంటి క్రేజీ భామని ఓల్డ్ ఉమెన్ గా చూపించాలంటే గట్స్ ఉండాలి. అయితే తమిళ దర్శకులకు అది కొత్తేమి కాదు ఆల్రెడీ సిమ్రాన్ ను ఓల్డ్ ఉమెన్ గా చూపించి సక్సెస్ అయ్యారు. మొత్తానికి కాజల్ ఎలా కనిపిస్తుంది అన్న విషయం మీద కూడా ఇండియన్-2 పై ఆసక్తి పెరిగింది.



మరింత సమాచారం తెలుసుకోండి: