తమిళ హీరోనే అయినా సూపర్ స్టార్ రజినికి తెలుగులో సూపర్ ఫాలోయింగ్ ఉంటుంది. రజినికాంత్ సినిమా రిలీజ్ అంటే ఇక్కడ స్టార్ సినిమాల రిలీజ్ షెడ్యూల్ కూడా మార్చుకునే పరిస్థితి ఉండేది. అయితే ఇదంతా ఒకప్పటి పరిస్థితి రోజులు మారాయి. రజిని క్రేజ్, ఇమేజ్ పెరిగినా తెలుగులో ఆయన సినిమాలు ఇదవరకులా ఆశించిన ఫలితాలను అందుకోవడం లేదు.


దీనికి కారణం ముఖ్యంగా తెలుగులో రజిని సినిమాకు ఎక్కువ బిజినెస్ డిమాండ్ చేయడమే. ఎలాగు ఇక్కడ ఫాలోయింగ్ ఉంది కాబట్టి కచ్చితంగా పెద్ద మొత్తంలో రాబడుతుందని భారీ రేటు కోట్ చేస్తున్నారు. లింగా నుండి రీసెంట్ రిలీజ్ 2.ఓ వరకు అలానే జరిగింది. అయితే తమిళంలో లాగా సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా కలక్షన్స్ రాబట్టే పరిస్థితి తెలుగులో లేదు.


లింగా తెలుగులో ఫ్లాప్ అవగా కబాలి, కాలా సినిమాలు ఏడో అలా ఆడేశాయి. అయినా డిస్ట్రిబ్యూటర్స్ కు ఆ రెండు సినిమాలు లాసులు తెచ్చాయని తెలుస్తుంది. 2.ఓ విషయంలో కూడా 72 కోట్లకు ఇప్పటివరకు 35 కోట్లే వచ్చాయి ఇంకా సగం రాబట్టాల్సి ఉంది. అందుకే రజిని ప్రస్తుతం చేస్తున్న పేటా మూవీని తెలుగులో రిలీజ్ చేయదలచుకోలేదట.


కార్తిక్ సుబ్బరాజు డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో రజినికాంత్ మరోసారి డాన్ గా కనిపిస్తున్నారు. ఈ సినిమా నుండి మొదటి సాంగ్ రిలీజైంది. తెలుగులో ఇప్పటివరకు ఈ సినిమాకు సంబందించి ఎలాంటి అప్డేట్ రాలేదు. అందుకే దాదాపు పేటాని తెలుగులో రిలీజ్ చేయరని అంటున్నారు. ఈ సినిమాలో రజిని సరసన త్రిషా, మేఘా ఆకాశ్ హీరోయిన్స్ గా నటించారు. సంక్రాంతికి అసలే తెలుగులో గట్టి పోటీ ఉంది కాబట్టి కోలీవుడ్ లో సంక్రాంతి టార్గెట్ తో వస్తున్న పేటా తెలుగులో రిలీజ్ ఛాన్స్ లేదని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: