సూపర్ స్టార్ మహేష్ బాబు విలన్ గా చేస్తే ఎలా ఉంటుంది. ఏంటి వరుస సినిమాలతో బిజీగా ఉన్న మహేష్ కు హీరోగా సినిమాలు చేసేందుకే తీరిక లేదు మరి విలన్ గా చేస్తాడా అంటే సరైన సబ్జెక్ట్ వస్తే తమలోని నటుడిని ప్రూవ్ చేసుకునేందుకు ఈ తరం స్టార్స్ రెడీగా ఉన్నారు. ఆ కోవలో మహేష్ కూడా రెగ్యులర్ సినిమాల కన్నా ప్రయోగాలకు పెద్దపీఠ వేస్తున్నాడు. 


ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరక్షన్ లో మహర్షి సినిమా చేస్తున్న మహేష్ ఈ సినిమా తర్వాత అసలైతే సుకుమార్ డైరక్షన్ లో మూవీ చేయాల్సి ఉన్నా ఆ సినిమాపై ఇంకా అనుమానాలు వస్తున్నాయి. మహేష్ కు నచ్చే కథ రెడీ చేయడంలో సుకుమార్ సక్సెస్ కాలేకపోతున్నాడట. అందుకే ఆ సినిమా అసలు ఉంటుందా లేదా అన్న డౌట్ మొదలైంది.


ఇదిలాఉంటే కోలీవుడ్ క్రేజీ డైరక్టర్ మణిరత్నం మరోసారి మహేష్ తో మల్టీస్టారర్ మూవీ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా మణిరత్నం ఓ సినిమా చేస్తున్నారట. ఆ సినిమాలో మహేష్ విలన్ గా విజయ్ హీరోగా చేస్తారట. అయితే మహేష్ విలన్ గా చేసేది తమిళంలో.. అదే సినిమా తెలుగులో కూడా చేస్తారట తెలుగులో మహేష్ హీరోగా.. విజయ్ విలన్ గా కనిపిస్తారట.


ఆల్రెడీ మణిరత్నం విలన్ సినిమాతో ఇలాంటి ప్రయత్నమే చేశాడు. రావణ్ గా రిలీజైన ఆ సినిమా తెలుగు, తమిళ, హింది భాషల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఎంత క్యారక్టర్ బాగున్నా విలన్ గా మహేష్ అంటే ఫ్యాన్స్ ఒప్పుకోరు. అందుకే ఇదంతా ఫేక్ న్యూస్ అని కొట్టిపారేస్తున్నారు ఆడియెన్స్. మణిరత్నం మాత్రం ఈ క్రేజీ మల్టీస్టారర్ మీద గురి పెట్టుకుని ఉన్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: