రోబో సీక్వల్ గా వచ్చిన 2.ఓ సినిమా 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన విషయం తెలిసిందే. శంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసిన ఈ సినిమా మంచి కలక్షన్స్ తో దూసుకెళ్తుంది. మొదటి నుండి ఈ సినిమా బాహుబలికి పోటీ అన్న టాక్ వినిపించింది. అయితే 5 డేస్ కలక్షన్స్ చూస్తే బాహుబలి కన్నా 2.ఓ చాలా వెనుకపడి ఉందని తెలుస్తుంది. 


తెలుగు రెండు రాష్ట్రాల పరిస్థితి చూస్తే గురువారం రిలీజైన 2.ఓ 5 రోజుల్లో 36 కోట్ల షేర్ రాబట్టింది. ఎన్వీ ప్రసాద్, దిల్ రాజు ఈ సినిమా తప్పకుండా అంచనాలను అందుకుంటుందని 72 కోట్లకు కొనేశారు. 5 రోజుల్లో 36 కోట్లు తెచ్చిన 2.ఓ ఇంకా సగం రాబడితేనే బ్రేక్ ఈవెన్ రీచ్ అయినట్టు లెక్క. చూస్తుంటే అది కష్టమే అనిపిస్తుంది.


ఇక బాహుబలి సీరీస్ విషయానికొస్తే.. బాహుబలి బిగినింగ్ 66 కోట్ల బిజినెస్ చేయగా మొదటి 5 రోజుల్లో 52 కోట్లు రాబట్టింది. ఓవరాల్ గా ఈ సినిమా తెలుగు రెండు రాష్ట్రాల్లో బీభత్సమైన లాభాలు తెచ్చిపెట్టింది. ఇక బాహుబలి-2 అయితే 5 రోజుల్లో ఏకంగా 100 కోట్లు కొల్లగొట్టింది. 122 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా బాహుబలి కన్ క్లూజన్ కూడా తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ కు కాసుల పంట పండించింది. 


2.ఓ కన్నా సూపర్ స్టార్ రజినికాంత్ నటించిన కబాలి సినిమా 40 కోట్ల బిజినెస్ చేయగా తొలి 5 రోజుల్లో 20 కోట్లు రాబట్టింది. అయినా సరే ఆ సినిమా నష్టాలను మిగిల్చింది. మొత్తానికి బాహుబలి వర్సెస్ 2.ఓ ఫైట్ లో బాహుబలిని ఏమాత్రం అందుకోలేకపోయింది 2.ఓ. బాహుబలికి డబుల్ బడ్జెట్ తో 2.ఓ నిర్మించడం విశేషం. 



మరింత సమాచారం తెలుసుకోండి: