2.0’ అనుకున్న స్థాయిలో బ్లాక్ బస్టర్ కాకపోవడంతో ఇప్పుడు జాతీయమీదియా దృష్టి లేటెస్ట్ గా మొదలైన ‘ఆర్ ఆర్ ఆర్’ పై పడింది. వాస్తవానికి ఈసినిమా విడుదల కావడానికి ఇంకా చాలకాలం ఉన్న అప్పుడే జాతీయ మీడియా ‘ఆర్ ఆర్ ఆర్’ కు పెను సమస్యగా మారబోతున్న ఒక ప్రత్యేక విషయం పై చర్చలకు తెర తీసింది. 

రజినీకాంత్ ‘2.0’ సాధారణ ప్రేక్షకులకు ఊహించన స్థాయిలో కనెక్ట్ కాకపోవడానికి ఆసినిమాకు సంబంధించిన కథ విషయంలో దర్శకుడు శంకర్ అందరికీ తెలిసిన విషయాన్నే మళ్ళీ చెప్పడం అంటూ కామెంట్స్ చేసింది ఆ ప్రముఖ ఇంగ్లీష్ జాతీయ పత్రిక. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసిన ‘బాహుబలి’ గ్రాఫిక్స్ తో రూపొందిన ఫాంటసీ మూవీ అంటూ అలాంటివి చాల అరుదుగా వస్తాయని కామెంట్ చేసింది. 

అయితే ‘బాహుబలి’ స్థాయికి మించిన గ్రాఫిక్స్ ‘2.0’ లో ఉన్నా అది ప్రేక్షకులకు సరిగ్గా కనెక్ట్ అవ్వకపోవడానికి గల కారణం ఈసినిమాలో కథలో ఉన్న లోపంతో పాటు హ్యూమన్ ఎమోషన్స్ ను సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోవడం అంటూ ఆపత్రిక అభిప్రాయ పడింది.  దీనితో గ్రాఫిక్స్ ను ఫాంటసీని అందర్నీ మెప్పించేలా చూపగలిగితేనే ఆసినిమాలు హిట్ అవుతాయి అన్న విషయాన్ని ‘2.0’ తక్కువ కలెక్షన్స్ రుజువు చేస్తున్నాయి అంటూ కామెంట్స్ చేసింది మీడియా. ఇద్దరు స్టార్ హీరోలతో స్వతంత్రం రాక మునుపు బ్యాక్ డ్రాప్ కథతో రాజమౌళి నిర్మిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ లో కూడ అత్యంత భారీ స్థాయిలో గ్రాఫిక్స్ ఉన్నప్పటికీ కథ విషయంలో రాజమౌళి అందర్నీ మెప్పించగల స్థాయిలో తీయలేకపోతే ‘2.0’ కి జరిగిన అవమానం రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ కి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అంటూ జాతీయ మీడియా అభిప్రాయ పడుతోంది. 

అంతేకాదు రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ కోసం ఎంచుకున్న కథ రెగ్యులర్ కమర్షియల్ డ్రామా కింద వస్తుందని దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో  ‘బాహుబలి’ టైమ్ కి రాజమౌళి టీమ్ తీసుకొచ్చిన హైప్ ‘ఆర్ ఆర్ ఆర్’ కు జాతీయస్థాయిలో తీసుకు రావడం చాల కష్టం అంటూ కామెంట్స్ చేస్తున్న జాతీయ మీడియా వ్యాఖ్యానాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొంధించిన ‘2.0’ అందర్నీ మెప్పించలేకపోయిన పరిస్థుతులలో ‘ఆర్ ఆర్ ఆర్’ కథ విషయమై రాజమౌళి చాల జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆ ప్రముఖ పత్రిక చేసిన కామెంట్స్ ఒక విధంగా రాజమౌళిని ఖంగారు పెడతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు..  


మరింత సమాచారం తెలుసుకోండి: