సినీ ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ గురించి దుమారం రేగిన సంగతీ తెలిసిందే . అయితే ఇండస్ట్రీలో స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోయిన్స్ కు వేధింపులు ఉండవని అందరూ అనుకుంటారు అయితే అది తప్పని శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి చెబుతుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన వరలక్ష్మి తనకు ఎదురైన లైంగిక వేదింపులను చెప్పుకొచ్చింది. చిన్నతనంలో తాను కొన్ని సార్లు లైంగిక వేదింపులకు పాల్పడ్డట్లుగా పేర్కొంది.


చిన్నప్పటి విషయాన్ని పక్కకు పెడితే హీరోయిన్ అయిన తర్వాత ఒక టీవీ ఛానెల్ లో ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆ ఇంటర్వ్యూ పూర్తి అయిన తర్వాత యాంకర్ మిగతా విషయాలు బయట మాట్లాడుకుందామా అంటూ ప్రశ్నించాడు. మిగిలిన విషయాలు అంటే ఏంటో ప్రత్యేకంగా చెప్పన్కర్లేదు బయట మాట్లాడుకుందా అన్నాడంటే అతడి ఉద్దశ్యం ఏంటో చెప్పనక్కర్లేదు. ఆ వ్యక్తి నాతో మాట్లాడిన ఆ మాటకు తీవ్ర ఆగ్రహం కలిగింది. కాని తాను ఆ సమయంకు కాస్త సంయమనం పాటించి అక్కడ నుండి వచ్చేశాను అంటూ చెప్పుకొచ్చింది.స్టార్ కిడ్స్ కు కూడా ఇలాంటి వేదింపులు తప్పవని వరలక్ష్మికి ఎదురైన అనుభవం ద్వారా చెప్పుకోవచ్చు.

Image result for varalakshmi

స్టార్ కూతురు అయినా కూడా వరలక్ష్మి కేవలం హీరోయిన్ పాత్రల కోసమే చూడకుండా తనలోని నటిని సంతృప్తిపర్చుకునేందుకు విలన్ పాత్రలు కూడా పోషిస్తూ వస్తోంది. తాజాగా పందెంకోడి 2 మరియు సర్కార్ చిత్రాల్లో విలన్ గా నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. భవిష్యత్తులో కూడా అలాంటి పాత్రలే వస్తే తప్పకుండా చేస్తాను అంటూ ప్రకటించింది. ఒక మోస్తరులో ఎక్స్ పోజింగ్ కు ఓకే కాని అవసరం లేకున్నా స్కిన్ షో చేయను అంటూ ఈమె తెగేసి చెప్పేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: