భారతీయ చలన చిత్ర రంగంలో అద్భుతమైన ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ ఎవరంటే వెంటనె చెబుతారు విశ్వనటుడు కమల్ హాసన్ అని..మరుగుజ్జుగా, అమాయకుడిగా, ఉన్మాధిగా,బామ్మగా, పది పాత్రలు ఒకేసారి ఇలా ఏం చేసినా..ఆయనకే చెల్లుబాటు అవుతుంది.  ఒక పాత్ర కోసం ఆయన శరీరంతో కూడా ప్రయోగాలు చేసిన సందర్బాలు ఉన్నాయి.  అందుకే ఆయన విశ్వనటులు అయ్యారు.  ప్రస్తుతం కమల్ హాసన్ నటుడిగానే కాకుండా రాజకీయాల్లోకూడా ఎంట్రీ ఇచ్చారు. 
Image result for కమల్ హాసన్ పార్టీ
ఆ మద్య  'మక్కల్ నీధి మయ్యం’అనే పార్టీని స్థాపించి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు.  తాజాగా విశ్వనటుడు  కమల హాసన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఆయన మూవీస్ కి గుడ్ బాయ్ చెప్పబోతున్నారట..అంతే కాదు శంకర్ దర్శకత్వంలో వచ్చే ‘భారతీయుడు 2’ఆయన చివరి చిత్రం అని అంటున్నారు.  1996లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిస్తున్న ‘భారతీయుడు 2’ తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నట్టు ప్రకటించి చిత్ర పరిశ్రమను ఆశ్చర్య పరిచారు. 
Image result for indian 2 movie
కాగా, ఈ నెల 14 నుంచి ‘భారతీయుడు 2’ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్టు చెప్పారు.  ఈ చిత్రం తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాల్లో నిమగ్నం కాబోతున్నారట. భారతీయుడు 2 చిత్రం కథ కమల్ రాజకీయ జీవితానికి బూస్ట్ ఇచ్చేలా ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో కమల్ సరసన కాజల్ అగర్వాల్ నటించనుంది.  వాస్తవానికి ఈ చిత్రంలో ముందుగా నయనతార అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆమె స్థానంలో కాజల్ ని తీసుకున్నట్లు సమాచారం.  కమల్‌తో తొలిసారి నటిస్తుందన్నందుకు కాజల్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: