ఒకరి దురదృష్టం మరొకరికి అదృష్టంగా మారడం సినిమాలలో రాజకీయాలలో సర్వసాధారణ విషయం. అయితే ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేస్తుంది అన్న అంచనాలతో విడుదలైన ‘2.0’ ఇప్పుడు విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ కు అదృష్టంగా మారడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

అత్యంత భారీ అంచనాలతో విడుదలైన ‘2.0’ మూవీకి పూర్తి పాజిటివ్ టాక్ వచ్చినా ఆసినిమాను రెండవసారి చూడటానికి సాధారణ ప్రేక్షకులు ఇష్టపడటం లేదు. ఇలాంటి పరిస్థుతులలో ప్రస్తుతం చూడటానికి చెప్పుకోతగ్గ సినిమాలు ఏవీ లేకపోవడంతో చాలామంది టైమ్ పాస్ కొరకు ‘టాక్సీవాలా’ ను మళ్ళీ చూడటానికి ఇష్టపడుతున్నారు అని వార్తలు వస్తున్నాయి. 

నిన్న మన తెలుగు రాష్ట్రాలలో ‘2.0’ ధియేటర్లలలో 85 శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తే ఇప్పటికీ ‘టాక్సీవాలా’ ధియేటర్లలో 70 శాతం ఆక్యుపెన్సీ కనిపించడం చాలమందిని ఆశ్చర్య పరుస్తోంది. ఇలాంటి పరిస్థుతులలో ఫెయిల్ అవుతుంది అనుకున్న ‘టాక్సీవాలా’ ఘన విజయం సాధించడం ఇండస్ట్రీ రికార్డులను తిరిగి రాస్తుంది అని భావించిన ‘2.0’ అంచనాలను పూర్తిగా అందుకోలేకపోవడం ప్రస్తుతం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

దీనితో విజయ్ దేవరకొండ పని అయిపోయింది అంటూ ప్రచారం చేసిన వ్యక్తులకు రజినీకాంత్ మ్యానియా కూడ ‘టాక్సీవాలా’ ను ఆటంక పరచలేకపోయింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అంతేకాదు ఈవారం విడుదల కాబోతున్న ‘కవచం’ ‘నెక్స్ట్ ఏంటీ’ ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమాలకు కూడ డివైడ్ టాక్ వస్తే ‘టాక్సీవాలా’ ఊహించని పరిస్థుతులలో ‘గీతాగోవిందం’ స్థాయిలో కలక్షన్స్ రాబట్టినా ఆశ్చర్యం లేదు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: