ఈ సంవత్సరం సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్, సమంత నటించిన ‘రంగస్థలం’బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.  ఈ సినిమాలో నటించిన అన్ని పాత్రలకు ఎంతో పేరు వచ్చింది. ముఖ్యంగా రంగమ్మ అత్త గా జబర్థస్త్ యాంకర్ అనసూయకు బాగా అదృష్టం కలిసి వచ్చింది.  ఓ వైపు జబర్ధస్త్ లో కొనసాగుతూనే పలు ఛానల్స్ లో యాంకరింగ్ చేస్తున్న అనసూయ ప్రస్తుతం సినీ రంగంవైపు దృష్టి సారిస్తుంది. అందుకు అనుకూలంగా వరుస ఛాన్సులు కూడా కొట్టేస్తుంది. గతంలో రెండుమూడు సినిమాల్లో నటించినా పెద్దగా పేరు రాలేదు..‘రంగస్థలం’సినిమా తర్వాత అనసూయ క్రేజ్ బాగా పెరిగిపోయింది.
Related image
తాజాగా దిల్ రాజు నిర్మాతగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2' సినిమా రూపొందుతోంది. వెంకటేశ్ .. వరుణ్ తేజ్ కథానాయకులుగా చేస్తోన్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. ఈ సినిమా ఫుల్ లెన్త్ కామెడీ ఎంట్రటైన్ మెంట్ గా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో అనసూయ మెరవనున్నట్టు తెలుస్తోంది. వెంకటేశ్, వరుణ్ తేజ్,అనసూయలపై ఈ స్పెషల్ సాంగ్ ను చిత్రీకరించనున్నట్టు సమాచారం. 
Image result for suya suya anasuya song
ఆ మద్య సాయిధరమ్ తేజ్ నటించిన ‘విన్నర్’ సినిమాలో సూయా సూయా అంటూ కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టిన అనసూయ ఈసారి ఏ రేంజ్ లో ఐటమ్ సాంగ్ లో మెరవబోతుందూ చూడాలి. అందులోనూ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ యూత్ ను, మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేస్తుందని అంటున్నారు.  ఈ సినిమాలో వెంకటేష్ సరసన తమన్నా నటిస్తుంది..ఇక వరుణ్ తేజ్ జోడిగా మెహ్రీన్ నటిస్తుంది. అనిల్ రావిపూడి వరుస హిట్లు కొడుతుండటంతో, ఈ సినిమాపై మంచి అంచనాలు వున్నాయి. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: