రికార్డులెపుడూ ఒకేలా ఉండవు. ఒకరికి ఫేవర్ చేయవు. అలా మారుతూ ఉంటాయి. అయితే ఒకసారి అదిరిపోయే రికార్డ్ పడిందంటే దానిని కదిలించడం కష్టమే. ఇపుడు అలాంటి ఇలాంటి కానీ గొప్ప రికార్డు ఒకటి యంగ్ రెబల్ స్టార్ సాధించేశారు. ఆయన లేటెస్ట్ మూవీ సాహో ఆ రికార్డు ని క్రియేత్ చేసింది. ఈ మూవీ దాదాపుగా పూర్తి చేస్తుని వచ్చే ఏడాది థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.


లుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ ఫిల్మ్ శాటిలైట్ హక్కుల కోసం భారీ డిమాండ్ నెలకొంది. స్టార్ – జీ ఛానెళ్ల మధ్య గట్టి పోటీ ఏర్పడింది. ఓ ఛానెల్ చివరకు ‘సాహో’ శాటిలైట్ హక్కులను 70 కోట్లకు దక్కించుకున్నట్లు ఇన్‌సైడ్ సమాచారం. టాలీవుడ్ ఇండస్ర్టీలోనే మరే హీరోకి సాధ్యంకాని రికార్డుగా చెబుతున్నారు. దీనితో విడుదల కాక ముందే నిర్మాతల పాకెట్స్‌లో 70 కోట్లు చేరినట్టే. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్ హీరోయిన్ కాగా, నీల్‌నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, మందిర‌బేడీలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.


మొత్తానికి టైటిల్లోనే కాదు. రికార్డులలోనూ సాహో అనిపించుకునేలా ప్రభాస్ సత్తా చాటుతున్నాడు. బాహుబలి వన్, టూ తరువాత ప్రభాస్ రేంజి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇపుడు సాహోతో సరికొత్త రికార్డులు సాధించేందుకు రెడీ అయిపోతున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: