Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Dec 16, 2018 | Last Updated 4:25 pm IST

Menu &Sections

Search

ఎన్టీఆర్ లుక్ పై వస్తున్న పుకార్లు నమ్మకండి..క్లారిటీ ఇచ్చిన ట్రైన‌ర్‌!

ఎన్టీఆర్ లుక్ పై వస్తున్న పుకార్లు నమ్మకండి..క్లారిటీ ఇచ్చిన ట్రైన‌ర్‌!
ఎన్టీఆర్ లుక్ పై వస్తున్న పుకార్లు నమ్మకండి..క్లారిటీ ఇచ్చిన ట్రైన‌ర్‌!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో బాహుబలి, బాహుబలి 2 లాంటి ప్రతిష్టాత్మక సినిమాలు తెరకెక్కించిన రాజమౌళి సంవత్సరం ఖాళీగా ఉన్నారు.  చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా అడుగు పెట్టినప్పటి నుంచి అపజయం అన్నది ఎరుగని రాజమౌళి ‘బాహబలి 2’తో ప్రపంచ వ్యాప్తంగా తన సత్తా ఏంటో చాటుకున్నారు.  మరోసారి వెండితెరపై సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్దమవుతున్నారు రాజమౌళి.  జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి భారీ బడ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం తెరకెక్కించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ అనే టైటిల్‌తో ప్ర‌చారం జ‌రుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది.  

rajamouli-ss-ntr-ram-charan-rrr-movie-dvv-danayya-

ఎన్టీఆర్ - రాజమౌళి కాంబినేషన్ లో ఇప్పటికే స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ సినిమాలు బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నారు.  ఇక మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో ‘మగధీర’ సినిమాతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రికార్డులు తిరగరాశారు.  ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు తెరపై ఒకేసారి కనిపించబోతున్నారు..అంటే ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవొచ్చడు..దానికి తగ్గట్టుగానే అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు రాజమౌళి. మ‌ల్టీ స్టార‌ర్ కోసం ఇద్ద‌రు హీరోలు త‌మ మేకోవ‌ర్‌ని పూర్తిగా మార్చుకుంటున్నార‌ని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి.  

rajamouli-ss-ntr-ram-charan-rrr-movie-dvv-danayya-

రాజమౌళి కోసం ఎన్టీఆర్ బరువు పెరుగుతున్నారని..భారీగా కనిపించబోతున్నారని రక రకాల వార్తలు వస్తున్నాయి.  ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ లుక్ ఇదే అంటూ జోరుగా ప్ర‌చారం చేశారు. దీనిపై ఎన్టీఆర్ జిమ్ ఫిట్‌నెస్ ట్రైన‌ర్ లాయిడ్ స్టీవెన్స్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు.  సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఫోటో గ‌త ఏడాదికి సంబంధించిన‌ది. ఆయ‌న లుక్ అది కాదు అని లాయిడ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా వివ‌ర‌ణ ఇచ్చారు. 

rajamouli-ss-ntr-ram-charan-rrr-movie-dvv-danayya-

ఇక మేజిక్ డేట్ (12-12-12)న సినిమాకి సంబంధించి భారీ ఎనౌన్స్‌మెంట్ వస్తుంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో వేసిన భారీ సెట్లో జ‌రుగుతుంది.  కీర్తి సురేష్ ,ర‌ష్మిక క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రంలో ప్రియ‌మ‌ణి లేడి విల‌న్‌గా క‌నిపించ‌నుంద‌ట‌. 2020లో విడుద‌ల కానున్న రాజ‌మౌళి మ‌ల్టీ స్టార‌ర్ సినిమాకి కీరవాణి సంగీతం అందించ‌నున్నారు. డీవీవీ దాన‌య్య  సినిమా నిర్మిస్తున్నారు.  సెంథిల్‌కుమార్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేయ‌నున్నాడు. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా సినిమాకి  డైలాగ్స్ రాస్తున్నారు. 
rajamouli-ss-ntr-ram-charan-rrr-movie-dvv-danayya-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దర్శకుడు తులసి రామ్‌సే కన్నుమూత!
ఆలియా భట్ డ్యాన్స్ చూస్తే షాక్!
బోనీకపూర్ నిర్మాతగా అజిత్ 59వ మూవీ!
రూ.700 కోట్ల క్లబ్‌లో రజినీ‘2.0’..!
పెళ్లితో ఒక్కటైన శ్వేతాబసు జంట!
నాని సరసన ఐదుగురు హీరోయిన్లు..!
కార్తి మూవీలో హీరోయిన్ లేదట?!
నెట్టింట్లో స్టార్‌ కమెడియన్‌ పెళ్లి ఫోటో వైరల్!
టాప్ టెన్‌లో మూవీస్ లో రంగస్థలం, మహానటి!
హన్సిక ‘మహా’పోస్టర్ పై వివాదం!
జయలలిత పాత్రలో విద్యాబాలన్?!
భారీ బడ్జెట్ తో రానా  'హిరణ్యకశిప'!
రిలీజ్ కి ముందే 'ఒడియన్' రికార్డుల జోరు!
అనుష్క షాకింగ్ నిర్ణయం?!
ధనుష్ ‘మారి 2’తెలుగు ట్రైలర్ రిలీజ్!
రజినీ పుట్టినరోజు కానుకగా ‘పెట్టా’టీజర్!
చిరు సరసన రెండోసారి ఛాన్స్ కొట్టేసిన నయన్?!