‘2.0’ లాంటి భారీ సినిమా సునామీని కూడ తట్టుకుని తమిళనాడులో ‘96’ మూవీ కలక్షన్స్ విషయంలో కొనసాగిస్తున్న సంచలనాలు ఇండస్ట్రీ వర్గాలను విపరీతంగా ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇప్పటికే ఈసినిమా రీమేక్ హక్కులను సంపాధించిన దిల్ రాజ్ ఈమూవీని ఏదోవిధంగా తెలుగులో రీమేక్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నా అల్లు అర్జున్ నుండి నానీ వరకు ఈసినిమా బాగుంది అని ప్రసంసిస్తూనే ఈమూవీ రీమేక్ ఆలోచనలకు దిల్ రాజ్ కు ఏమాత్రం సహకరించడం లేదు. 

గతంలో కోలీవుడ్ హీరో విక్రమ్ కి పెద్ద బ్రేక్ ఇచ్చిన ‘సేతు’ ని ‘శేషు’ గా టాలీవుడ్ లో రాజశేఖర్ నటించి మెప్పించినా క్లాసిక్ మూవీగా పేరు వచ్చింది కానీ ఆమూవీని ఏమాత్రం ఆర్ధికంగా విజయవంతం కాని నేపధ్యంలో ఆ అనుభవాలే ఇప్పుడు మన టాప్ హీరోలకు గుర్తుకు వస్తున్నట్లు సమాచారం. దీనితో అల్లు అర్జున్ నానీలు ఈమూవీని ప్రత్యేకంగా షో వేయించుకుని చూసి ముచ్చటపడినా ఆమూవీలో నటించడానికి సాహసం చేయలేకపోతున్నారు. 

దీనితో దిల్ రాజ్ ఈమూవీ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ ను డైరెక్ట్ గా రంగంలోకి దింపి ఈమూవీలో గోపీ చంద్ ను హీరోగా నటించడానికి ఒప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు సంచలనాలు సృష్టించిన ఈమూవీ రీమేక్ లో మన టాలీవుడ్ హీరోలు నటించకపోవడానికి గల కారణం ఈమూవీ క్లైమాక్స్ అని అంటున్నారు. 

ఇలాంటి క్లైమాక్స్ లను తెలుగు ప్రేక్షకులు అంగీకరించరనీ ముఖ్యంగా ఈమూవీ స్లో నరేషన్ మన తెలుగువారికి ఏమాత్రం నచ్చదు అనీ అల్లు అర్జున్ నానీలు అభిప్రాయ పడినట్లు టాక్. అయితే ఈమూవీకి సంబంధించి క్లైమాక్స్ లో ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా గోపీ చంద్ ఈ ‘96’ రీమేక్ లో నటించడానికి ఒప్పుకున్న నేపధ్యంలో దిల్ రాజ్ టాప్ హీరోలకు గోపీచంద్ ద్వారా ఊహించని షాక్ ఇవ్వబోతున్నాడా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: