తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య వరుసగా బయోపిక్ చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పటికే అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా ‘మహానటి’తెరకెక్కించిన విషయం తెలిసిందే.  ఈ చిత్రం అంచనాలు మించి మంచి హిట్ అయ్యింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా చేసుకొని ‘యాత్ర’, తెలంగాణ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కత్తి కాంతారావు బయోపిక్ చిత్రాలు రాబోతున్నాయి. 
 అతిపెద్ద తారాగణం రికార్డ్...
 ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ‘ఎన్టీఆర్’బయోపిక్ చిత్రం తెరకెక్కిస్తున్నారు.  ఈ చిత్రంలో ఎన్టీఆర్ జీవితానికి సంబంధించిన అన్ని కోణాలు..బాల్యం నుంచి ఆయన ఇండస్ట్రీకి ఎలా ఎంట్రీ ఇచ్చారు..తర్వాత రాజకీయాల్లో ఎలా ఎంట్రీ ఇచ్చారన్న విషయాలు చూపించబోతున్నారట.  సాధారణంగా మల్టీస్టార్ చిత్రాలంటే..ఇద్దరూ..లేదా ముగ్గురు హీరోలు, హీరోయిన్లు ఉంటారు..కానీ ‘ఎన్టీఆర్’బయోపిక్ లో మాత్రం పదుల సంఖ్యలో హీరోలు, హీరోయిన్లు కనిపించబోతున్నారు. 
Related image
అదొక అద్భుతం అనుభూతి అని చెప్పక తప్పదు. అత్యంత అరుదుగా మాత్రమే ఇలాంటి కాంబినేషన్లు సాధ్యపడుతుంటాయి. ‘ఎన్టీఆర్-కథనాయకుడు’ రామారావు సినీ జీవితాన్ని ఫోకస్ చేసే చిత్రం కాబట్టి ఆయనతో వివిధ చిత్రాల్లో నటించిన హీరోయిన్ల పాత్రలు ఇందులో చూపించబోతున్నారు. దాదాపు 9 మంది హీరోయిన్లు మనకు తెరపై కనువిందు చేయబోతున్నారు.
Related image
విద్యా బాలన్ (బసవతారకం పాత్రోలో), నిత్యా మీనన్ (సావిత్రి),రకుల్ ప్రీత్ సింగ్ (శ్రీదేవి), హన్సిక (జయప్రద), మాళవిక నాయర్ (కృష్ణ కుమారి), పాయల్ రాజ్ పుత్ (జయసుధ), శాలిని పాండే (శావుకారి జానకి),  తో పాటు ఇషా రెబ్బ, దివ్యవాణి, ఆమని, పూనమ్ బజ్వా, మంజిమ మోహన్ తదితరులు నటిస్తున్నారు. 
Image result for ntr biopic stills
అంతేకాదు ఈ చిత్రంలో బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నటిస్తుండగా... రానా దగ్గుబాటి(సీఎం చంద్రబాబు), నందమూరి కళ్యాణ్ రామ్ (స్వర్గీయ నందమూరి హరికృష్ణ), సుమంత్ (అక్కినేని నాగేశ్వరరావు)  పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు మురళీ శర్మ, భాను చందర్, నరేష్, ప్రకాష్ రాజ్, సంజయ్ రెడ్డి, రవి కిషన్, వెన్నెల కిషోర్, భరత్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'ఎన్టీఆర్ బయోపిక్' అభిమానులకు మరిచిపోలేని అనుభూతిని అందించబోతోంది. 'ఎన్టీఆర్-కథానాయకుడు' జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా, రాజకీయ జీవితంపై తెరకెక్కబోతున్న 'ఎన్టీఆర్-మహానాయకుడు' జనవరి 24న రాబోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: