తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ ఎవరు.. ఇది సినీ అభిమానుల్లో తరచూ జరిగే చర్చే.. మా హీరో గ్రేట్ అంటే మా హీరో గ్రేట్ అంటూ ఫ్యాన్స్ చెప్పుకోవడం మామూలే. కానీ దేనికైనా ఓ లెక్క ఉండాలి కదా.. అలా లెక్కలు వేసే చెప్పేందుకు కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి. అవే సర్వేలు, ర్యాంకిగ్సు..

Related image


తాజాగా ఫోర్బ్స్ ఇండియా సెలబ్రెటీల జాబితా విడుదల చేసింది. సెలబ్రెటీల ఆదాయాలను పరిగణలోకి తీసుకుని ఈ ర్యాంకింగ్స్ ఇచ్చారు. ఈ జాబితాలో ఏడాదికి 253 కోట్ల రూపాయల ఆదాయంతో సల్మాన్ ఖాన్ నెంబర్ వన్ గా నిలిచారు. ఈయన ఇలా టాపర్ గా నిలవడం వరుసగా ఇది మూడోసారి కావడం విశేషం.

Related image

ఆ తర్వాత స్థానాల్లో అక్షయ్ కుమార్ 185 కోట్లతో... దీపికా పదుకునే 112 కోట్లతో రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. 97 కోట్ల సంపాదనతో అమీర్ ఖాన్ ఉన్నారు. వయస్సు మీదపడుతున్నా కూడా అమితాబ్ కుర్ర హీరోల కంటే ఎక్కువగా 96 కోట్లు సంపాదించారు.


Image result for amir khan and amitabh bachchan


ఇక మన తెలుగు హీరోల విషయానికి వస్తే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 24వ ర్యాంకుతో టాప్ స్టార్ గా నిలిచారు. ఆయన సంపాదన 31 కోట్ల రూపాయలు. ఆ తర్వాత స్థానాన్ని జూనియర్ ఎన్టీఆర్ ( 28 వ ర్యాంకు ) అందుకున్నారు. ఈయన సంపాదన 28 కోట్లు.. మహేశ్ బాబు ( 33వ ర్యాంకు ) 24 కోట్ల ఆదాయంతో మూడో స్థానం దక్కించుకున్నారు.


నాగార్జున ( 36 వ ర్యాంకు ) –22 కోట్లు, అల్లు అర్జున్ ( 64వ ర్యాంకు ) -15 కోట్లు, రామ్ చరణ్ ( 72వ ర్యాంకు ) 14 కోట్లు, విజయ్ దేవరకొండ ( 72 వ ర్యాంకు )14 కోట్లు సంపాదించారు. దర్శకుడు కొరటాల శివ కూడా 20కోట్ల ఆదాయంతో 39 వ ర్యాంకు దక్కించుకోవడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: