భారత దేశంలో కొంత కాలంగా ‘మీ టూ’ఉద్యమం పెద్ద ఎత్తున కొనసాగుతుంది.  ఇప్పటికే బాలీవుడ్ నుంచి తనూశ్రీ దత్తా ప్రముఖ నటుడు నానా పటేకర్ తనను లైంగికంగా వేదించారని సంచలన ఆరోపణలు చేశారు.  ఆమె తర్వాత ఎంతో మంది నటీమణులు మాత్రమే కాదు ఇతర రంగాల్లో పనిచేసే వారు సైతం ‘మీటూ’ఉద్యమంలో భాగంగా తమతో అసభ్యంగా ప్రవర్తించినారు..లైంగికంగా వేధించన వారు పేర్లు బహిర్గం చేస్తున్నారు.  ఆ మద్య టాలీవుడ్ శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ పై ఉద్యమం చేపట్టింది. 

టాలీవుడ్ లో పలువురు బడాబాబులు ఎంతో మంది యువతులను సినీ అవకాశాలు ఇప్పిస్తామని ట్రాప్ చేస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారని..తాను కూడా అలాంటి వారిచేతిలో బలైపోయాయని సంచలన ఆరోపణలు చేస్తూ..ఉద్యమం కొనసాగించింది.  ఆమెకు పలువురు మహిళా సంఘాలు, జూనియర్ ఆర్టిస్టులు మద్దతు పలికారు.  కొన్ని కారణాల వల్ల ఆమె ఉద్యమం మద్యలోనే ఆగిపోవడం..ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలోకి వెళ్లిపోవడం జరిగింది.  ఇప్పటికీ శ్రీరెడ్డి సోషల్ మీడియాలో క్యాస్టింగ్ కౌచ్ పై తన పోరు కొనసాగిస్తూనే ఉంది. 

తాజాగా కోలీవుడ్ లో మరో క్యాస్టింగ్ కౌచ్ వివాదం చెలరేగింది. ఓ క్యాస్టింగ్ డైరెక్టర్ వర్ధమాన తారలకు అవకాశాలను ఎరగా చూపి, వ్యభిచారం చేయిస్తున్నాడని ఓ యువతి ఆయన రాసలీలలను ఫేస్ బుక్ లో పోస్టు చేసింది.  అయితే తన గురించి ఎలాంటి విషయాలు బయట చెప్పినా తనతో తీసుకున్న వీడియోలు లీక్ చేస్తానని  మోహన్  బెదిరించారని ఆమె ఆరోపిస్తుంది. అవకాశాల పేరిట అతను చేస్తున్న దందాపై తనవద్ద ఎన్నో ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. తనకున్న ప్రాణభయం దృష్ట్యా, తన పేరును బయటపెట్టలేనని చెప్పిన ఆమె, సామాజిక మాధ్యమాల్లో పెట్టిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: