తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ఆ మద్య వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సమయంలో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.  అంతే కాదు మహేష్ కెరీర్ లో ఈ చిత్రం రెండు వందల కోట్ల క్లబ్ లో చేరింది.  ప్రస్తుతం మహేష్ బాబు స్టార్ డైరెక్టర్ వంశి పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’చిత్రంలో నటిస్తున్నాడు.  మహేశ్ బర్త్‌డే సందర్భంగా ఆగస్టు 9న ఫస్ట్‌లుక్ టీజర్‌ విడుదల చేశారు.
Related image
సోషల్ మీడియాలో టీజర్, ఫస్ట్ లుక్ దుమ్మురేపుతుంది.  అయితే  ఈ చిత్రంలో మహేష్ బాబు మూడు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారట.  ఈ టీజర్‌లో మహేశ్ స్టూడెంట్ పాత్రలో గడ్డంతో కనిపించారు. గత చిత్రాలకు భిన్నంగా మహేశ్ పాత్ర ఉండబోతోందని యూనిట్ ఫస్ట్‌లుక్ ద్వారా సంకేతాలిచ్చింది.  ఈ చిత్రంలో ఫస్ట్ హాఫ్ లో రిచ్ పర్సన్ గా తర్వాత స్టూడెంట్ గా..ఆ తర్వాత రైతుల కోసం పోరాడే ఓ రైతు బిడ్డగా కనిపించబోతున్నాడట.
Image result for maharshi movie
ఈ చిత్రంలో రైతు పాత్ర కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి సన్నివేశాలు హైదరాబాద్‌లో వేసి సెట్‌లో షూట్ స్తున్నారట. మహేష్ బాబు  మూడు పాత్రలంటే అభిమానులతో ఉత్సాహం మరింత రెట్టింపు అవుతుంది.  ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. మరో ముఖ్యపాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: