సౌత్ స్టార్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సమంత ఇప్పుడు అక్కినేని కోడలుగా కొత్త బ్రాండ్ ఏర్పరచుకుంది. నాగ చైతన్యతో వివాహం అనంతరం కమర్షియల్ సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన సమంత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఇంట్రెస్ట్ చూపిస్తుంది. రీసెంట్ గా వచ్చిన యూటర్న్ పర్వాలేదు అనిపించగా ఇప్పుడు మిస్ గ్రానీగా సమంత షాక్ ఇవ్వబోతుంది.


కొరియన్ మూవీ అయిన మిస్ గ్రానీ సినిమా రీమేక్ గా నందిని రెడ్డి డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. సైలెంట్ గా మూవీ షూటింగ్ కానిచ్చేస్తున్నారట. ఈ సినిమాలో సమంత బామ్మగా, పడుచు అమ్మాయిగా రెండు పాత్రల్లో నటిస్తుంది. తాంత్రిక శక్తులున్న ఈ సినిమా కచ్చితంగా తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని చెబుతున్నారు.


ఈ సినిమాతో సమంత మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా ఓ పక్క షూటింగ్ జరుగుతున్నా సినిమాకు సంబందించి ఎలాంటి అప్డేట్ బయటకు రానివ్వడం లేదు. సైలెంట్ గా కానిచ్చేసి ఫస్ట్ లుక్ తో అందరిని సర్ ప్రైజ్ చేయాలని చూస్తున్నారు.


ఈ సినిమా 2019 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అక్కినేని కోడలిగా సమంత చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ అభిమానులను సర్ ప్రైజ్ చేయడం ఖాయమని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ టీజర్ త్వరలో రిలీజ్ చేస్తారట. సమంతతో పాటుగా ఈ సినిమాలో నాగ శౌర్య నటిస్తున్నాడు. ప్రస్తుతం రవీంద్రభారతిలో సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: