పెళ్ళి అయిన తరువాత పద్ధతి మార్చుకుని సాంప్రదాయంగా కనిపించాలి అన్న కట్టుబాటు లేదు అంటూ సమంత వ్యవహరిస్తున్న తీరుతో నాగార్జున అభిమానులకు ఆశ్చర్యంతో పాటు ఆగ్రహం కూడ వ్యక్తం చేస్తున్నారు. మారుతున్న కాలంలో మరీ సాంప్రదాయంగా కనిపించవలసిన అవసరం లేనప్పటికీ అక్కినేని కోడలు సమంత గతంలో కంటే సెక్సీగా కనిపించడం నాగ్ అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది.

దీనితో సమంత అక్కినేని వారి కోడలయ్యాక ఎక్స్‌పోజింగ్‌ పెరిగింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నా ఆవిషయాలను సమంత పట్టించుకోకపోవడం మరింత ఆశ్చర్యంగా మారింది అంటూ నాగార్జున అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. ఆమధ్య తమకు పెళ్లి అయి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా నాగచైతన్యతో కలిసి వెకేషన్‌కు వెళ్లిన సమంత అక్కడ రెచ్చిపోయి ఫోటోలకు ఇచ్చిన పోజులు కూడా తీవ్ర విమర్శలకు తావు ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇలాంటి పరిస్థుతులలో సమంత లేటెస్ట్ గా తన స్టైల్ లో ఒక ఫొటో షూట్ చేసింది. యంగ్ బ్యూటీస్‌కు ఏమాత్రం తీసిపోని రీతిలో అందులో మోడర్న్ లుక్‌ తో ఎక్స్ పోజింగ్ చేస్తూ కనిపిస్తున్న సమంత ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. పెళ్లి తర్వాత కూడా హిట్లు వరస హిట్లు కొడుతున్న సమంతతో టాప్ హీరోలు నటించడానికి జంకుతున్న సందర్భంలో తాను ఎలాంటి పాత్రకు అయినా మరి ఎలాంటి ఎక్స్ పోజింగ్ కు అయినా రెడీ అంటూ సమంత లేటెస్ట్ గా చేసిన ఈ ఫోటో షూట్ సంకేతాలు ఇస్తోంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. 

ప్రస్తుతం ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న సమంత చైతన్యను టాప్ యంగ్ హీరోగా మార్చాలని తన వంతు ప్రయత్నాలు చేస్తూ చైతన్యతో కలిసి సినిమాలో కూడ నటిస్తోంది. యంగ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం లో ‘మజిలీ’ మూవీలో చైతూతో కలిసి నటిస్తున్న సమంత ఆతరువాత నందిని రెడ్డి దర్శకత్వంలో ఒక ప్రయోగాత్మక లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటించబోతున్న విషయం తెలిసిందే. ఈసినిమాలు చేస్తూనే సమంత తనలో గ్లామర్ తగ్గలేదు అని ఇస్తున్న సంకేతాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: