టాలీవుడ్ లో ఎంతో మంది కమెడియన్స్ ఉన్నారు..ఇప్పుడు జబర్ధస్త్ నుంచి ఎంతో మంది కమెడియన్లు మంచి ఫామ్ లో కొనసాగుతున్నారు.  షకలక శంకర్ అయితే హీరోగానే వస్తున్నారు.  గతంలో కమెడియన్లుగా వచ్చిన వారు హీరోలుగా కొన్ని సినిమాల్లో నటించారు.  అయితే హీరోగా సక్సెస్ కాని వారు తిరిగి కమెడియన్లుగానే కెరీర్ కొనసాగించారు.  పద్మనాభం,రాజబాబు,చలం లాంటి వారి తర్వాత బ్రహ్మానందం, ఆలీ హీరోలుగా నటించినా తర్వాత కమెడియన్లుగానే కొనసాగారు.  అయితే బెస్టు కమెడియన్ గా తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సునీల్ మాత్రం అందాల రాముడు తర్వాత మర్యాద రామన్న సినిమాతో హీరోగా సెలిట్ అయ్యారు. 
Image result for sunil ntr
ఈ సినిమాల తర్వాత సునీల్ నటించిన సినిమాలు వరుసగా ఫెయిల్ కావడంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’సినిమాలో మరోసారి కమెడియన్ గా నటించారు. ఇలా కమెడియన్ గా మారిన సునీల్ మరికొన్ని సినిమాల్లో అదే కంటిన్యూ చేస్తారని భావించారు. దాంతో  వరుసగా చేతినిండా సినిమాలున్నాయి. ఆదాయం కూడా కమెడియన్‌గా బాగానే వుంది. కానీ సునీల్‌కు ఇంకా హీరోగా హిట్‌కొట్టి తీరాలన్న కోరిక పోలేదని టాక్ వినిపిస్తోంది.రైటర్ వెలిగొండ శ్రీనివాస్ డైరెక్షన్ టీం  ఓ కథ సునీల్ కి వినిపించగా బాగా నచ్చడంతో ఓకే చెప్పినట్లు సమాచారం. 

ఇప్పుడు నిర్మాత కోసం వెదుకులాట సాగుతోందని వినికిడి.  అయితే ఈ సినిమాకు మాత్రం రెమ్యూనరేషన్ విషయంలో చాలా తగ్గించుకున్నట్లు సమాచారం అందుతుంది. కాకపోతే ఈ మద్య సునీల్ ఫిజిక్ గతంలో కమెడియన్ గా ఉన్నరోజులు గుర్తుకు తెస్తున్నాయి..మరి హీరోగా ఎలా సెట్ అవుతాడా అన్న ఆలోచనలు కూడా మొదలయ్యాయి.   మరి మళ్లీ హీరో అంటే జిమ్‌లో కష్టపడక తప్పదేమో. 


మరింత సమాచారం తెలుసుకోండి: