బెల్లం కొండ శ్రీనివాస్ నటించిన సినిమా కవచం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఈ సినిమా లో పస లేదని మొదటి షో తోనే అర్ధం అయిపొయింది. హీరోగా 5 సినిమాలు చేసినప్పటికీ బెల్లంకొండ వారసుడు ఇంకా నటనను నేర్చుకుంటూనే ఉన్నాడు. డైలాగ్‌లో పస ఉన్నప్పటికీ డైలాగ్ డెలివరీలో తేలిపోతూ.. హావభావాల్ని దరికి చేరనీయడం లేదు బెల్లంకొండ. ఇక హీరోయిన్‌గా నటించిన కాజల్.. నటన పరంగా తనకు తిరుగులేదని స్టార్ హోదాను కాపాడుకునే ప్రయత్నమైతే చేసింది.

ఫస్టాఫ్ అనాలిసిస్

అయితే రొటీన్ కథలో ఆమె నటనకు ఆస్కారం లేకపోయింది. మరో హీరోయిన్ మెహ్రీన్ ఉన్నది కాని.. ఆమెది అంత ప్రాధాన్యత ఉన్న పాత్ర కాకపోగా.. నెగిటివ్ షేడ్స్‌లో చూపించారు. ముఖేష్ రుషి, పోసాని క్రిష్ణ మురళి లాంటి సీనియర్ నటులు ఉన్నా వాళ్లను పెద్దగా ఉపయోగించుకోలేకపోయాడు దర్శకుడు. హరీష్ ఉత్తమన్ ఏసీపీ‌గా కీలకపాత్రలో కనిపించారు. ఇక టెక్నికల్ పరంగా తమన్ పాటలతో పర్వాలేదనిపించినా.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌పై పెద్దగా శ్రద్ధ పెట్టలేదు.

కవచం కథ ఏంటంటే

చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ప్లస్ అయ్యింది. విశాఖ అందాలను కెమెరాలో బాగా చూపించగలిగారు. పోలీస్ ఆఫీసర్‌గా శ్రీనివాస్‌ను స్టైలిష్‌గా చూపించారు. కాజల్‌ని మరింత అందంగా చూపించారు. సినిమా రన్ టైమ్ కూడా ఎక్కువగా ఉండటంతో చోటా కె ప్రసాద్ కత్తెరకు పనిచెప్పాల్సింది. అబ్బూరి రవి డైలాగ్స్ అక్కడక్కడా పేలాయి. స్క్రీన్స్ ప్లే మాత్రం గజిబిజి గందరగోళంలా ఉంది. లేనిపోని ట్విస్ట్‌లు, అక్కర్లేని సీన్లు, పాత్ర పరిచయాలతో ప్రేక్షకుల్ని కన్ఫ్యూజ్ చేశారు. ఓవరాల్‌గా బెల్లంకొండని ‘కవచం’ కాపాడలేకపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: