టాలీవుడ్, కోలీవుడ్ లో హీరో సూర్య అంటే ఎంతో క్రేజ్ ఉంది.  తమిళ హీరో అయినా సూర్యకు తెలుగు వారితో ఎక్కువ పరిచయం ఉంది..ఇక్కడ హీరోలతో ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారు.  తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా ప్రకృతి ఉపద్రవాలు సంబవిస్తే వెంటనే స్పందిస్తాడు.  గతంలో జరిగిన హుద్ హూద్ తుఫాన్ బాధితులకు సహాయాన్ని అందించారు.  సూర్య నటించిన తమిళ సినిమాలు తెలుగు లో కూడా మంచి విజయాలు అందుకోవడం..కలెక్షన్లు రాబడుతున్నాయి. ఆయన తమ్ముడు కార్తి కూడా తెలుగు లో మంచి పేరు సంపాదించాడు. 
Image result for surya hero ngk movie
ఆ మద్య అక్కినేని నాగార్జున తో ‘ఊపిరి’సినిమా లో కార్తి నటనకు ఎంతో మంచి పేరు వచ్చింది.  తాజాగా హీరో సూర్య ప్రముఖ దర్శకులు సెల్వరాఘవన్ దర్శకత్వంలో 'ఎన్జీకే' సినిమా రూపొందుతోంది. పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా నిర్మితమవుతోంది. డిఫరెంట్ లుక్స్ తో సూర్య కనిపించనున్న ఈ సినిమాలో, ఒక కథానాయికగా రకుల్ .. మరో కథానాయికగా సాయిపల్లవి కనిపించనున్నారు.  ఇక సూర్య సినిమా అంటే అటు తమిళ్ లో ఇటు తెలుగు లో మంచి క్రేజ్ ఉండటంతో  ఈ సినిమా ఆడియో హక్కులను భారీ రేటుకు సోనీ మ్యూజిక్ సౌత్ వారు దక్కించుకున్నట్టుగా సమాచారం.
Image result for surya hero ngk movie
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాపై సూర్య గట్టి ఆశలే పెట్టుకున్నాడని అంటున్నారు.  యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. ఆయన సంగీతం ఈ సినిమాకి హైలెట్ అవుతుందని అంటున్నారు.  మరో వైపు సూర్య ఆశించే హిట్ ఈ సినిమాతో దొరుకుతుందనే నమ్మకాన్ని ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: