రజినీకాంత్ ‘2.0’ మ్యానియా ముగిసి పోవడంతో సంక్రాంతికి రాబోతున్న రజినీకాంత్ మరో లేటెస్ట్ మూవీ ‘పెట్ట’ మూవీకి సంబంధించిన మరణ మాస్ సాంగ్ హడావిడి తమిళనాడును షేక్ చేస్తోంది. రజినీకాంత్ పాటలు అంటే పూర్తి మాస్ సాంగ్స్ గా ఉంటే అదిరిపోతాయి కాబట్టి సంగీత దర్శకుడు అనిరుద్ కోలీవుడ్ ప్రేక్షకుల అభిరుచి మేరకు ఒక మాస్ సాంగ్ ను ట్యూన్ చేయించి ఆపాటను ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం చేత పాడించాడు. 
నాకు సంతోషమే
ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రజని ప్రొఫెసర్ పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సూపర్ స్టార్ సరసన త్రిష, సిమ్రన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఒకప్పుడు సూపర్ స్టార్ రజని సినిమా అంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట ఉండాల్సిందే. కానీకొంత కాలం నుంచి రజినీ సినిమాలకు బాలు పాడటం లేదు.
కార్తీక్ సుబ్బరాజ్ దర్శత్వంలో
అయితే ‘పెట్ట’ మూవీలోని మరణ మాస్ సాంగ్ లో కొన్ని లైన్లు బాలసుబ్రహ్మణ్యం పాడాడు. ఇప్పుడు ఈవిషయమై ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం అభిమానులు అవమానంగా భావించి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బాలు లాంటి లెజెండ్రీ సింగర్ చేత పూర్తి పాత పాడించాలి కాని కేవలం కొన్ని లైన్లు మాత్రమే పాడించడం ఏంటనేది బాలు అభిమానుల ప్రశ్న. 
చాలా కాలం తర్వాత
ప్రస్తుతం మీడియాను షేక్ చేస్తున్న ఈ వ్యవహారం పై బాలసుబ్రహ్మణ్యం స్వయంగా స్పందించాడు. తాను ఈపాటలో పాడింది కేవలం కొన్ని లైన్స్ మాత్రమే అని అంటూ చాల రోజుల తరువాత తాను రజినీకాంత్ సినిమా కోసం పాడటం ఆనందంగా ఉంది అంటూ మిగిలిన ఆపాటకు తన గొంతు అవసరం లేదు అని అనిరుద్ భావించి ఉంటాడనీ సద్దుపాటు ప్రయత్నాలు చేసాడు. అయినా ఇది బాలసుబ్రహ్మణ్యంకు జరిగిన అవమానమే అంటూ అభిమానులు అనిరుద్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: