టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో మన్మధుడుగా పిలిపించుకునే నాగార్జున తన ఫిట్ నెస్ కు విపరీతమైన ప్రాధాన్యత ఇస్తాడు. తన వయసు పెరుగుతున్నా ఆఛాయలు ఎక్కడా కనపడనీయకుండా నాగార్జున చాల జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు హుషారుగా కనిపిస్తూ యంగ్ హీరోలకు సవాల్ విసరడం నాగార్జున హాబి.

అయితే దీనికి భిన్నంగా నిన్న శుక్రవారం జరిగిన తెలంగాణ ఎన్నికలలో ఓటు వేసిన తరువాత ఆయన షేర్ చేసిన ఒక పిక్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. నాగార్జున గారూ.. ఈ ఫొటోను ఎలిమినేట్ చేయండి అంటూ నాగ్ ఫ్యాన్స్ నాగార్జునకు రిక్వెస్ట్ లు పెడుతున్నారు అంటే నిన్నటిరోజున నాగార్జునను చూడగానే అభిమానులు ఎంతగా భయపడిపోయారో అర్ధం అవుతుంది. 

నిన్న ఓటు వేయడానికి నాగ్ తన భార్య అమలతో కలిసి వచ్చి అందరితో కలిసి క్యూ లైన్ లో నుంచున్నాడు. మిగతా సెలబ్రెటీల్లాగే నాగ్ కూడా ఓటు వేసిన అనంతరం సెల్ఫీ తీసుకుని దాన్ని ట్విట్టర్లో షేర్ చేయడం ద్వారా జనాల్లో చైతన్యం తేవాలని చూశాడు. అయితే ఈ ఫొటోలో నాగ్ ఏమంత బాగా కనిపించలేదు ఏదో సినిమా కోసం గడ్డం పెంచినట్లుగా కనిపిస్తున్నా దానికి సరిగ్గా రంగు లేకపోవడం వల్ల అక్కడక్కడ తెల్లగా కనిపించింది. 

దీనికితోడు నాగార్జున ముఖం కూడ ఏమాత్రం ఫ్రెష్ గా లేకుండా చాల నీరసంగా కనిపించింది. ప్రస్తుతం పెరిగిన వయసు ప్రభావం నాగార్జున ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. తనకున్న ఇమేజ్ దృష్ట్యా బయటికి వచ్చేటపుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించే నాగ్ నిన్నటిరోజున ఇంత ఆర్డినరీ లుక్‌తో ఎలా బయటికి వచ్చాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే నాగార్జునకు పెరిగిన వయసు రీత్యా ఈ మధ్య మెయింటైనెన్స్ తగ్గించాడేమో అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు



మరింత సమాచారం తెలుసుకోండి: