ఈ మద్య బాలీవుడ్ లో ప్రతిష్టాత్మక బ్యానర్స్ లో వచ్చే చిత్రాలు దాదాపు ఎన్నో కాంట్రవర్సీలతో మొదలవుతున్నాయి.  షూటింగ్ మొదలు రిలీజ్ అయ్యే వరకు ఈ కాంట్రవర్సీలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇలాంటి కాంట్రవర్సీలు ఆ చిత్రాలకు ప్లస్ పాయింట్స్ గానే నిలుస్తున్నాయి.  ఆ మద్య సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకొనె నటించిన ‘పద్మావత్’చిత్రంపై ఎన్ని గందరగోళాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే.  తాజాగా  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సారా అలీ ఖాన్ జంటగా అభిషేక్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కేదార్‌నాథ్' సినిమా విడుదల కాకుండా బ్యాన్ విధించాలని డిమాండ్ చేస్తున్నారు కేదార్‌నాథ్ తీర్థ పురోహతులు.
 అనేక అభ్యంతరాలు
ఈ సినిమా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని వారు ఆరోపిస్తున్నారు.  దీంతో కేదార్‌నాథ్, ఉదమ్‌ సింగ్ నగర్ సహా మొత్తం ఏడు జిల్లాల్లో ఈ చిత్రాన్ని తొలుత, ఆపై రాష్ట్ర వ్యాప్తంగా నిషేదిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. పవిత్రమైన కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రం పరిసరాల్లో వల్గర్ డాన్సులు చేసినట్లు సినిమాలో చూపించబోతున్నారు. దీన్ని మేము ఎంత మాత్రం అంగీకరించబోమని అంటున్నారు. 2013లో కేదార్‌నాథ్‌ను ముంచెత్తిన భారీ వరదల నేపథ్యంతో ప్రేమకథా చిత్రంగా ఈ సినిమాను రూపొందించారు.
కేదార్‌నాథ్
ఇటీవల విడుదలైన ట్రైలర్లో వరద విషాదంతో పాటు హీరో హీరోయిన్ ముద్దు సీన్లు కూడా చూపించారు.  దాంతో ఈ చిత్రంపై వ్యతిరేకత ఏర్పడింది. ఈ చిత్రం లవ్ జీహాద్‌ ను ప్రోత్సహిస్తోందని కేదార్‌ నాథ్ భక్త మండల్ ఉత్తరాఖండ్ హైకోర్ట్‌ ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన ధర్మాసనం, స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని సలహా ఇవ్వడంతోనే శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని నిషేదం విధించినట్టు ప్రభుత్వం తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: