‘నోటా’ పరాజయం తరువాత విజయ్ దేవరకొండ పని అయిపోయింది అంటూ మొదలైన విమర్శలకు విజయ్ ‘టాక్సీవాలా’ ద్వారా సరైన సమాధానం ఇచ్చాడు. ‘గీతగోవిందం’ స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినా ‘టాక్సీవాలా’ కు ఊహించని స్థాయిలో లాభాలు వచ్చాయి అన్న ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికీ మన తెలుగు రాష్ట్రాలలో ఈమూవీ ఇంకా మంచి కలక్షన్స్ తో ప్రదర్శింపబడుతూనే ఉంది. ఇప్పట్లో విజయ్ నుండి మరో సినిమా వచ్చే ఆస్కారం లేకపోవడంతో ఇప్పుడు అతడి అభిమానులు వచ్చే ఏడాది విడుదల కాబోయే ‘డియర్ కామ్రేడ్’ గురించి ఆలోచనలు చేస్తున్నాడు. 

తెలుస్తున్న సమాచారం మేరకు ప్రస్తుతం విజయ్ దేవరకొండకు ఏర్పడిన భారీ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఈమూవీ కథకు మార్పులు చేసి తిరిగి రీ షూట్ చేస్తున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా విజయ్ తో సినిమాలు చేయాలని అదేవిధంగా అతడు అడుగుతున్న 10 కోట్ల పారితోషికం ఇవ్వడానికి చాలామంది సిద్దపడుతున్నా విజయ్ ఎవరికీ అంగీకారం తెలపకుండా అందర్నీ పెండింగ్ లో పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఈ లిస్టులో మారుతీ గోపీచంద్ మలినెని పూరీ జగన్నాథ్ లాంటి దర్శకుడు చాలామంది విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తుంటే విజయ్ మాత్రం వారిని పక్కకు పెట్టి ఒక టాప్ దర్శకుడు వైపు చూస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం అనేకమంది దర్శకులు చెపుతున్న డజన్ల కొద్దీ కథలు వింటున్న విజయ్ దేవరకొండ చాలామంది దర్శకుల చక్రవ్యూహంలో చిక్కుకున్నాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: