ఇప్పటికే లక్ష పుస్తకాలు చదివిన పవన్ కళ్యాణ్ తన ‘జనసేన’ కు సంబంధించిన రాజకీయ ఉపన్యాసాలలో తన పుస్తకాల విజ్ఞానాన్ని వీలైనంత వరకు ప్రదర్శించదానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవకాసం దొరికితే చాలు తన మాటలలో అమరావతిని సింగపూర్ గా మారుస్తాను అంటూ చెపుతున్న నేపధ్యంలో పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా తన ఉపన్యాసాలలో ఇజ్రాయెల్ దేశం ప్రస్తావన తీసుకువస్తున్నాడు. 

గత కొద్ది రోజులుగా తన రూట్ మార్చి రాయలసీమ ప్రాంతానికి చెందిన కరువు జిల్లాలలో తన ప్రజా పోరాట యాత్ర కొనసాగిస్తున్నపవన్ ఇప్పుడు లేటెస్ట్ గా రైతులను ఆకర్షించడానికి ఇజ్రాయెల్ వ్యవసాయం పద్ధతులు గురించి అక్కడ టెక్నాలజీ గురించి రాయల సీమ ప్రాంత రైతులకు వివరిస్తూ వారిని ఆకర్షించే కొత్త ప్రయత్నాలు మొదలు పెట్టారు. రాయలసీమ ప్రాంత కరువు సమస్యలు తీరాలి అంటే కేవలం అది ఇజ్రాయెల్ టెక్నాలజీ ద్వారానే కుదురుతుందని మరో సరికొత్త వాదానికి తెర తీసాడు. 
  ఇజ్రాయెల్ లో నేలసారం ఉండదు కాబట్టి అక్కడి ప్రజలు టెక్నాలజీ వినియోగించుకుని కరువుని జయించారు అని చెపుతూ వెయ్యి గజాల్లో నలుగురికి సరిపడా ఆహారం పండించే టెక్నిక్ ఇజ్రాయెల్ రైతులకు బాగా తెలుసు అని చెపుతూ అదేతరహా టెక్నాలజీతో ఇక్కడ తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఆర్జించే అవకాశాలున్నాయి అంటూ పవన్ ఇస్తున్న సలహాలు రైతులను బాగా ఆకర్షిస్తున్నాయి.  అయితే కేవలం ఎన్నికల సమయం వచ్చినప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలకు రైతులు గుర్తుకు వస్తున్న నేపధ్యంలో ఇప్పుడు పవన్ కూడ అదేదారి అనుసరిస్తున్నాడా అంటూ సెటైర్లు పడుతున్నాయి. 

వాస్తవానికి రాయలసీమ ప్రాంతంలో కరువును పారద్రోలడానికి నాణ్యమైన విత్తనాలు పురుగు మందులు ఇస్తే చాలని అసలు ఇప్పటి వరకు నీళ్ళేలేని ప్రాంతంలో పవన్ చెప్పే ఇజ్రాయెల్ వ్యవహసయ పద్దతులు ఎంతవరకు అనుసరణనీయం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా పవన్ రాజకీయ వ్యూహాలు మార్చి కేవలం యూత్ పైనే ఆశలు పెట్టుకోకుండా రైతులను టార్గెట్ చేస్తూ ప్రస్తుతం అనుసరిస్తున్న వ్యూహాలు పూర్తిగా అమలు చేయగలిగితే రానున్న ఎన్నికలలో ‘జనసేన’ కొంతవరకు మెరిగైన ఫలితాలు సాధించే ఆస్కారం ఉంది..    


మరింత సమాచారం తెలుసుకోండి: