జబర్ధస్త్ లో ఇప్పటి వరకు ఎంతో మంది కమెడియన్లు వస్తున్నారు..పోతున్నారు.  అయితే మంచి గుర్తిపు తెచ్చుకున్న వారు వెండి తెరపై తమ సత్తా కొనసాగిస్తున్నారు.  అలాంటి వారిలో ధన్ రాజ్, వేణు, షకలక శంకర్, తాగుబోతు రమేష్ ఈ మద్య సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను ఇతర కమెడియన్లు కూడా రాణిస్తున్నారు.  ఇక జబర్ధస్త్ కామెడీ షోతో హాట్ యాంకర్లుగా గుర్తింపు పొందిన అనసూయ, రష్మిలు పలు చిత్రాల్లో బిజీగా మారిపోతున్నారు.  ఆ మద్య తాగుబోతు రమేష్ జబర్ధస్త్ షో తో ఎంతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు..తర్వాత చిత్రాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 
Image result for jabardasth comedy show rajamouli
ఇప్పుడు జబర్దస్త్ షోలో తాగుబోతుగా రాజమౌళి ఎంట్రీ ఇచ్చాడు. అంతే కాదు మనోడు పారడే సాంగ్స్ పాడుతూ అందరినీ అలరిస్తున్నాడు.  తాజాగా  రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..మొదటి నుంచి కూడా నాకు నటన అంటే ఇష్టం. నటనకి సంబంధించి లోకల్ గా నాకు మంచి గుర్తింపు ఉండేది.  2015 లో నేను ‘జబర్ధస్త్’లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో చిన్న పాత్రలు పోషించాను. అప్పట్లో పెద్దగా గుర్తింపు రాలేదు. 
Image result for jabardasth comedy show rajamouli
అదే సమయంలో ‘జబర్ధస్త్’లో అనుకోకుండా నాకు తాగుబోతు వేషం లభించింది..దానికి నేను సరైన న్యాయం చేయడమే కాదు అందరినీ కడుపుబ్బా నవ్వించాను.  దాంతో నాగబాబు ఎంతో మెచ్చుకోవడమే కాదు ఇలాంటి పాత్రలు కొత్తగా చేయాలని అన్నారు.  అప్పటి నుంచి తాగుబోతు పాత్రల్లో ఎప్పటి కప్పుడు కొత్తదనం ఉండేలా చూసుకోవడం వలన ఈ రోజున ఇంతమంది అభిమానాన్ని పొందుతున్నానని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: