నయనతార. అందంతో పాటు అభినయం కలిగిన అద్భుత నటి. సౌత్ ఇండియాలో క్రేజ్ ఉన్న హెరోయిన్. మూడు పదులు దాటిన వయసులో కూడా ఇంకా అదే దూకుడుతో దూసుకుపోతున్న నయన్ కాల్షీట్ల కోసం నిర్మాతలు క్యూ కడతారు. హీరోలు ఆమె పెయిర్ కావాలంటారు. డైరెక్టర్లు సైతం ఆమెనే కోరుకుంటారు. అటువంటి నయన్ ఇటు సీనియర్ హీరోలకూ జోడీగాను. అటు యూత్ హీరోలకూ జంటగానూ కనిపిస్తూ రేర్ రికార్డ్ ని క్రియేట్ చేస్తోంది.


నయన్ విషయానికి వస్తే తెలుగులో ఆమె చేస్తున్న ఒకే ఒక చిత్రం సైరా నరసిమ్హారెడ్డి. ఈ మూవీలో ఆమె నాటి తరం మహరాణిగా నటిస్తున్నారు. ఇక ఈ మూవీ ఇలా ఉండగానే  మెగాస్టార్ చిరంజీవితో మరో మూవీని చేసేందుకు నయన్ రెడీ అంటోంది. సెన్షేషనల్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో చిరంజీవి నటించబోయే చిత్రంలో మెగా హీరోకు జోడీగా నయన్ సెలెక్ట్ అయిందని టాక్. ఈ మూవీ కోసం కొరటాల, చిరంజీవి ఇద్దరూ కూడా తమ ఓటును నయన్ కే వేశారంటే విశేషమే.


ప్రస్తుతం తెలుగు .. తమిళ భాషల్లో అనుష్క .. నయనతార .. త్రిష .. శ్రియ మాత్రమే సీనియర్ కథానాయికలుగా కనిపిస్తున్నారు. వీళ్లందరిలో తెలుగు .. తమిళ  .. మలయాళ భాషల్లో మంచి క్రేజ్ వున్న కథానాయిక నయనతార మాత్రమే. అందుకనే 'సైరా' కోసం ఆమెనే తీసుకున్నారు. కొరటాల సినిమా విషయంలోను కథానాయిక సమస్య తలెత్తింది. పాత్ర పరంగాను .. తన క్రేజ్ కి తగిన జోడీగాను నయనతార అయితేనే బాగుంటుందని చిరంజీవి అనడంతో, ఆమెనే కొరటాల ఖరారు చేశారని చెప్పుకుంటున్నారు. మొత్తానికి చూసుకుంటే మరో మారు నయన్ చిరుతో జత కలవడం పట్ల మెగాభిమానులు ఖుషీ అవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: