భారతీయ చలన చిత్ర రంగంలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి జాతీయ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు మళియాళ సూపర్ స్టార్ మోహన్ లాల్.  ఈ మద్య తెలుగు లో కూడా వరుసగా చిత్రాలు చేస్తున్నారు. ఆ మద్య కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’చిత్రంలో ముఖ్యభూమిక పోషించారు.  ఇలా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తున్న మోహన్ లాల్ హీరోగా మలయాళంలో 'ఒడియన్' రూపొందింది. శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మితమైంది. 

ఈ చిత్రంలో మోహన్ లాల్ చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారట.  ఎనభై ఏళ్ల వృద్దుడిగా..పాతికేళ్ల యువకుడిగా కనిపించబోతున్నారు.  ఇందుకోసం మోహన్ లాల్ పది కిలోలు తగ్గినట్లు సమాచారం. మలయాళంతో పాటు తెలుగులోను ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.  ఇప్పటికే ఈ పోస్టర్లకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది.
Image result for odiyan movie telugu posters
ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఈ చిత్రం నుంచి టీజర్ ను రిలీజ్ చేస్తారు. మోహన్ లాల్ కెరీర్ లో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించారు..ఆ మద్య ‘మన్యంపులి’ తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. 'ఒడియన్'   సంచలన విజయాన్ని సాధించడం ఖాయమనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.     



మరింత సమాచారం తెలుసుకోండి: