పవర్ స్టార్ అంటే వెంటనే పవన్ కళ్యాన్ అనుకొని తప్పులో కాలేస్తారేమో..కాదు..తమిళ ఇండస్ట్రీలో ఓ పవర్ స్టార్ ఉన్నారు..ఆయనే  శ్రీనివాసన్.  కమెడిన్ గా పాత్రల్లో నటిస్తూనే.. అప్పుడప్పుడు హీరోగా నటిస్తుంటారు శ్రీనివాసన్.  అంతే కాదు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు. తాజాగా తమిళనటుడు 'పవర్ స్టార్'  శ్రీనివాసన్ అదృశ్యమయ్యాడని ఆయన భార్య జూలీ ఫిర్యాదు చేయడం కలకలం రేపగా, ఆపై గంటల వ్యవధిలోనే దాన్ని ఆమె వెనక్కు తీసుకుంది. 
Image result for Tamil actor 'Powerstar' Srinivasan wife missing case
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం తమిళ నటుడు శ్రీనివాసన్ పై న్యూఢిల్లీతో పాటు రాష్ట్రంలోని పోలీసు స్టేషన్లలో కేసులున్నాయని తెలిపారు.  అంతే కాదు ఇటీవల ఓ వ్యక్తిని డబ్బు విషయంలో దారుణంగా మోసం చేసినట్లు ఫిర్యాదు రిజిస్ట్రర్ అయ్యింది.  తన భర్తను ఎవరో కిడ్నాప్ చేశారని..కనిపించడం లేదని శ్రీనివాసన్ భార్య జూలి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Image result for Tamil actor 'Powerstar' Srinivasan wife missing case
అయితే ఓ గంట తర్వాత శ్రీనివాసన్ ఊటిలో ఉన్నట్లు తెలియడంతో ఆయన్ను కలిసేందుకు ఊటీ వెళ్లిన జూలీ, తన ఫిర్యాదును వెనక్కు తీసుకుంది. ఆయనపై రిజిస్టర్ అయిన కేసులను విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: