రామ్ చరణ్ , ఎన్టీఆర్ ఇండస్ట్రీ లో మంచి మిత్రులని అందరికి తెలిసిందే. పైగా ఇద్దరు కలిసి రాజమౌళి సినిమా లో నటిస్తున్నారు. అయితే రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ  ప్రీ రిలీజ్ వేడుకను త్వరలోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రీ రిలీజ్ వేడుక గురించి పలు రకాల వార్తలు వస్తున్నాయి. మొన్నటి వరకు ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక వైజాగ్ లో బీచ్ లో చేయబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. తాజాగా ఈ వేడుకలో ఆర్ ఆర్ ఆర్ టీం పాల్గొనబోతున్నట్లుగా చర్చ జరుగుతోంది.

Image result for ram charan and ntr

ప్రస్తుతం జక్కన్న దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి రామ్ చరణ్ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. తాజాగా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న మల్టీస్టారర్ రెండవ షెడ్యూల్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఈ గ్యాప్ లోనే చరణ్ మూవీ వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ వేడుకలో రాజమౌళి పాల్గొనేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. జక్కన్నతో పాటు ఎన్టీఆర్ కూడా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది.

Image result for ram charan and ntr

ఒకే వేదికపై వీరు ముగ్గురు కనిపిస్తే ప్రేక్షకుల్లో మల్టీస్టారర్ పై మరింత ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. భారీ ఎత్తున అంచనాలున్న వినయ విధేయ రామ వేడుకలో జక్కన్న ఎన్టీఆర్ లు కనిపిస్తే సినిమా స్థాయి ఇంకా పెరుగుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. వినయ విధేయ రామ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించిన అన్ని వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: