ఈ మద్య సినిమా హీరోలు సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటున్నారు.  ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్ట్రాగామ్ లు వచ్చిన తర్వాత తమ అభిమానులతో నేరుగా తన అభిప్రాయాలు పంచుకుంటున్నారు.  కొన్ని సార్లు సోషల్ మీడియాలో వివాదాలు కూడా కొని తెచ్చుకుంటున్నారు.  కొన్ని సార్లు సానుభూతి పొందుతున్నారు.  నిన్న తెలంగాణలో ఎన్నికలు పూర్తి అయ్యాయి.  ఈ సందర్భంగా ఎంతో మంది సినీ సెలబ్రెటీలు తమ ఓటు క్యూ లైన్లో నిలబడి మరీ వినియోగించుకున్నారు. 

ఈ సందర్బంగా ఓటర్లలో ఉత్సాహాన్ని తీసుకు రావడానికి సోషల్ మీడియాలో తాము ఓటు వేశామని..ఓటు మన ఆయుధం అంటూ సందేశాలు ఇస్తూ ఫోటోలు షేర్ చేశారు.  అంతే కాదు ఓటు వేయకపోవడం సోమరితనం..రేపు రాజకీయ నేతలను ప్రశ్నించే హక్కు ఉండదని సూచనలు కూడా ఇచ్చారు.  ఇక  టాలీవుడ్ హీరో రామ్ వేటువేశాక చేతి వేలికున్న సిరా గుర్తును చూపుతూ ఓ ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేసుకున్నాడు.

దానికి  ‘నాది నాదే మరి మీది’ అన్న క్యాప్షన్ ను జత చేశాడు. దాంతో పలువరు సినీ సెలబ్రెటీలు సైతం తాము ఓటు వేశాక దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే ఓ యువకుడు మాత్రం రామ్ ఛాలెంజ్ కు స్పందిస్తూ ‘మాది ఆంధ్రా లే’ అని కామెంట్ పెట్టాడు.  దానికి వెంటనే స్పందించిన రామ్ అది కూడా మనదే తమ్ముడూ.. మనకు ఒక్క ముఖ్యమంత్రి సరిపోలేదనే ఇద్దరికి ఇచ్చాం.

విడదీసి ఇచ్చాం తప్ప విడిపోలేదు. ఏపీ, తెలంగాణ రెండూ మనవే’ అని కౌంటర్ వేశారు. అయితే రామ్ ఇచ్చిన సమాధానానికి నెటిజన్ దిమ్మతిరిగి ఉంటుందని పలువురు అభిమానులు...నెటిజన్లు రామ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: