తెలుగు, తమిళ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో పాత్రల్లో నటించిన బహుభాషా నటుడు విజయకుమార్ మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు.  గత కొంత కాలంగా ఆయన కుమార్తె వనితకు మధ్య గతకొంత కాలంగా ఆస్తి వివాదాలు సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయకుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు వనితను నిన్న రాత్రి అరెస్ట్ చేశారు.  విజయ్ కుమార్ కు ఆలపాక్కం, అష్టలక్ష్మి నగర్ 19వ వీధిలో పెద్ద ఇల్లు ఉంది. ఆ ఇంటిని విజయ్ కుమార్ షూటింగ్ ల నిమిత్తం అద్దెలకు ఇస్తుంటారు.

ఈ నేపథ్యంలోనే విజయ్ కుమార్ కూతురు, నటి వనిత ఓ సినిమా షూటింగ్ ను చేసుకోవడానికి ఆ ఇంటిని తీసుకుంది. అయితే షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఆమె ఇంటిని విడిచిపెట్టి వేళ్లకుండా అక్కడే ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా ఖాళీ చేసేందుకు నిరాకరించింది. మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో విజయకుమార్ గతంలో మధురవాయిల్ పోలీసులను ఆశ్రయించారు. నటుడు విజయ్ కుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వనితను అరెస్ట్‌ చేయడానికి ఆ ఇంటికి వెళ్లారు.
తండ్రి భవనం కబ్జా
వనిత పోలీసులతో వాగ్వాదానికి దిగింది. కొందరు పోలీసులపై చేయి కూడా చేసుకోవడంతో పరిస్థితి చేజారినట్టు మీడియా కథనాలు వచ్చాయి. ఆ తర్వాత వనిత అక్కడి నుంచి పరారైంది. అప్పట్లో వనిత సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఆమెను అరెస్ట్ చేయరాదని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో ఆమె గురువారం మళ్లీ తిరిగివచ్చింది.
Image result for actor vijayakumar vanitha
కాగా, శుక్రవారం ఆమె ఉంటున్న ఇంటికి వెళ్లడంతో మరోసారి గొడవ మొదలు అయ్యింది. దాంతో మళ్లీ కూతురు వనితపై మధురవాయిల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు విజయ్ కుమార్. ఆమెను తన ఇంటి నుంచి ఆమెను ఖాళీ చేయాల్సిందని వేడుకొన్నారు. దాంతో పోలీసులు వనిత ఉంటున్న ఇంటికి వచ్చి ఆమెను అరెస్ట్‌ చేశారు. ఆమెను పోలీసులు ఓ రహస్య ప్రాంతానికి తరలించినట్టు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: