తమిళనాడులో పుట్టక పోయినా అక్కడ జనాలకు రజనీకాంత్ ఆరాధ్య దైవం. ఆయనది సుదీర్ఘమైన సినీ కెరీర్. అంతకంటే ఎంతో ఉన్నతమైనది వ్యక్తిత్వం. నిర్మ‌లంగా ఉండడం, నిజాయతీగా వ్యవహరించడం వంటి లక్షణాల వల్లనే రజనీకాంత్ తమిళ జనాలకు ఆధ్యుడు, ఆరాధ్యుడు అయ్యాడు. మైసూర్ స్టేట్ లో పుట్టి కన్నడ సీమలో చదివి తమిళ నాట పూజ్యనీయుడిగా ఉండడం అంటే రజనీకే చెల్లింది. ఆయన జీవితం పూల పానుపు కాదు. ఎన్నో అవమానాలు, బాధలు తట్టుకుని రజనీ అత్యున్నతమైన స్థాయిని అందుకున్నారు.


ఆయన 1950 డిసెంబర్ 12న అప్పటి మైసూర్ స్టేట్ లో పుట్టాడు. తరువాత కాలంలో అది కన్న‌డ సీమగా మారింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలలో  కన్నడ రాష్ట్రంగా  కూడా ఏర్పడింది. రజనీ తొమ్మిదవ ఏటనే తల్లి చనిపోయింది. ఇద్దరు అన్నలు, ఒక అక్క తరువాత అందరి కంటే  చిన్నవాడు రజనీకాంత్. అతను చిన్నతనంలో  రామక్రిష్ణమిషన్ లో వేదాలు చదువుకున్నారంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అలా అప్పటి నుంచే రజనీలో ఆధ్యాత్మిక భావాలు మొలకలెత్తాయి. ఇక రజనీ పూర్వీకుల మూలాలు అటు మహారాష్ట్రలోనూ, ఇటు తమిళ నాట కూడా ఉన్నాయి. తమిళనాట క్రిష్ణగిరి జిల్లాలో రజనీ మూల వాసులు ఉండేవారు. అందువల్ల ఆయన యావత్తు దక్షిణాదికి చెందిన వాడిగా చెప్పుకోవడం సబబు.


సినీ కెరీర్ లో విలన్ గానే ఆయన ఆరంభం అంతా సాగింది. శాడిస్ట్ భర్తగా, క్రూరయమైన ప్రతి నాయకునిగా అనేకే చిత్రాల్లో నటించిన తరువాత కానీ రజనీ కెరీర్ ఒక కుదుటన పడలేదు. రజనీకి సినిమా లైఫ్ ని ఇచ్చింది బాల చందర్ ఐతే కెరీర్ ని మలుపు తిప్ప్పింది మాత్రం ఎస్పీ ముత్తు రామన్ అని చెప్పాలి.  1980 దశకంలో రజనీ యాక్షన్ మూవీస్ ద్వారా హీరో ఎదుగుతూ స్టార్ డం నిరూపించుకున్నారు. ఆయన ఒకే మారు అటు తమిళ్, ఇటు తెలుగు, కన్నడ వంటి బహు భాషల్లో నటించి యావత్తు సౌత్ ఇండియాకు సుపరిచితుడయ్యాడు.


ఈ కుర్రాడిలో ఏదో స్పార్క్ ఉంది. ఎప్పటికైనా గొప్ప నటుడు అవుతాడు అనిపించుకున్నాడు. కన్నడంలో విష్ణువర్ధన్ తో కలసి నటించిన రజనీ తమిళంలో శివాజీ గణేషన్ వంటి మహా నటుడితో యాక్ట్ చేశాడు. ఇక తెలుగులో అన్న నందమూరి తారక రామారావు తో డీ అంటే డీ అనే పాత్రలో టైగర్ మూవీలో కనిపిస్తారు. అలాగే సూపర్ స్టార్ క్రిష్ణతో పలు చిత్రాల్లో నటించిన రజనీ శోభన్ బాబు తో కూడా జీవన పోరాటం మూవీ చేశారు. అలాగే చిరంజీవి తో కలసి కూడా రెండు మూడు సినిమాలు రజనీ చేశాడు. మొత్తానికి తెలుగు జనం అభిమానం నిండుగా సంపాదించుకున్న రజనీ లేటెస్ట్ మూవీ 2.0 తో ఇపుడు ధిరేయటర్లతో సందడి చెస్తూ 70 కి చేరువ అవుతున్నా సత్తా తగ్గలేదని చాటి చెబుతున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: