ఇప్పడూ టీడీపీ కి మరియు పవన్ కళ్యాణ్ కు మాటల యుద్ధం జరుగుతున్న సంగతీ తెలిసిందే. అయితే నాగబాబు బాలకృష్ణ ఎవరో నాకు తెలియదని సంచలనం రేపాడు. బాలకృష్ణ ఎవరో నాకు తెలీదు, ఐయామ్ సారీ, నేను మాట్లాడను. ఈ మాట అంటోంది ఎవరో కాదు. చిరంజీవి తమ్ముడు, పవన్ కల్యాణ్ అన్నయ్య నాగబాబు. బాలయ్య పేరు ఉచ్ఛరించడానికి కూడా నాగబాబు అంగీకరించలేదు. పైపెచ్చు, ఆ పేరుతో చిన్నపాటి కామెడీ కూడా చేశారు.

Image result for nagababu

అయ్యో.. బాలయ్య గురించి తెలియదని అన్నానేంటి. బాలయ్య చాలా పెద్ద ఆర్టిస్టు. సీనియర్ మోస్ట్ నటుడు. అప్పట్లో నేరము-శిక్ష లాంటి సినిమాల్లో కృష్ణ, బాలయ్య కలిసి యాక్ట్ చేశారు." నందమూరి బాలకృష్ణ గురించి అడిగితే ఇలా కామెడీ చేశారు నాగబాబు. అప్పటికీ జర్నలిస్ట్ ఈ ప్రశ్నను సాగదీశారు. ఆ బాలయ్య కాదు, ఇప్పటితరం నందమూరి బాలకృష్ణ అని చెప్పారు. ఈ బాలకృష్ణ ఎవరో నాకు తెలీదన్నారు నాగబాబు.

Image result for nagababu

నిజంగా నాగబాబుకు బాలయ్య తెలియకపోవడం హాస్యాస్పదం. కాకపోతే ఆయన కావాలనే ఇలా స్పందించారు. ప్రస్తుతం రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి, జనసేనకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టీడీపీ నేతలంతా పవన్ ను విమర్శిస్తున్నారు. అందుకే బాలయ్యపై అడిగిన ప్రశ్నకు నాగబాబు ఇలా స్పందించారు. ఆయనెవరో తనకు తెలియదంటూ, టీడీపీ ఇగోపై కొట్టారు. పవన్ తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే నిరాకరిస్తానంటున్నాడు నాగబాబు. జనసేన పార్టీలో ఓ నాయకుడిగా కంటే సామాన్య కార్యకర్తలా పనిచేయడం తనకు ఇష్టమని ప్రకటించాడు. మరీ ముఖ్యంగా తమ్ముడి పక్కన కూర్చోవడం కంటే, అతడి కింద పనిచేయడాన్నే ఎక్కువ ఇష్టపడతానని తెలిపారు నాగబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: