గత నాలుగు దశాబ్దాలుగా ఫిలిం ఇండస్ట్రీలో కొనసాగుతున్న నందమూరి బాలకృష్ణ తెలియదు అని ఎవరైనా అంటే అది అత్యంత హాస్యాస్పదంగా కనిపిస్తుంది. కానీ ఇటువంటి జోక్ ను నాగబాబు వేయడం బాలకృష్ణ అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగించినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

ఆసక్తికరమైన ఈన్యూస్ వివరాలలోకి వెళితే నాగబాబు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో హడావిడి చేస్తోంది. ఆ ఇంటర్వ్యూలో అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ నాగబాబు తనకు ఎదురైన ఒక ప్రశ్న పై వింత సమాధానం ఇచ్చాడు. బాలకృష్ణ రామ్ గోపాల్ వర్మ లపై మీఅభిప్రాయం ఏమిటి అంటూ ఆ ఇంటర్వ్యూ నిర్వహించిన వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ తనకు బాలయ్యబాబు ఎవరో తనకు తెలియదు అంటూ కామెంట్ చేసాడు. 

అయితే ఆతరువాత మరొక ట్విస్ట్ ఇస్తూ తనకు ‘నేరము శిక్ష’ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణతో నటించిన బాలయ్య తెలుసు కానీ బాలకృష్ణ తెలియదు అంటూ చేసిన కామెంట్స్ నందమూరి అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నాయి. ప్రస్తుతానికి నాగబాబు ‘జనసేన’ పార్టీలో లేకపోయినా వచ్చే ఎన్నికలలో తాను ‘జనసేన’ కోసం ప్రచారం చేస్తాను అన్న సంకేతాలు ఇచ్చాడు. 

ఇప్పుడు ఈ సంకేతాలకు అనుగుణంగా నాగబాబు బాలకృష్ణ ఎవరో తనకు తెలియదు అంటూ కామెంట్స్ చేసి రాబోతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో జరగబోతున్న బాలయ్యా పవన్ ల మధ్య మాటల వార్ కు సూచనగా నాగబాబు ఇలాంటి జోక్స్ వేసి ఉంటాడని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. నాగబాబు ఈ ఇంటర్వ్యూలో సరదాగా అన్న కామెంట్స్ రానున్న రోజులలో ఎలాంటి మలుపులు తీసుకుంటాయో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: