‘బాహుబలి2’ సూపర్ సక్సస్ వెనుక ‘కట్టప్ప బాహుబలి’ ని ఎందుకు చంపాడు అన్న సస్పెన్స్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదేతీరు ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో రాజమౌళి కొనసాగిస్తాడా లేదంటే ఎంతోకొంత ఈసినిమా కథకు సంబంధించిన స్టోరీ లైన్ ను ముందుగానే ఓపెన్ చేస్తాడా అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

ప్రస్తుతం సోషల్ మీడియాలో హడావిడి చేసే చాలామంది రచయితలుగా కూడ మారిపోతున్న నేపధ్యంలో ఈమూవీ కథ గురించి రకరకాల ఊహాగానాలు ఇప్పటికే మొదలైపోయాయి. ప్రస్తుతం ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించి సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న ఈమూవీ కథకు సంబంధించిన ఊహాగానాలు తారా స్థాయికి చేరిపోయాయి. 

దీనితో అప్పుడే కొందరు ‘ఆర్ ఆర్ ఆర్’ కథలో కొత్తదనం ఏముందీ అంటూ నెగిటివ్ ప్రచారం కూడ మొదలు పెట్టేసారు. ఇలాంటి పరిస్థుతులలో ‘ఆర్ ఆర్ ఆర్’ కథకు సంబంధించి ఎంతోకొంత క్లారిటీ ఇస్తే బాగుంటుంది అన్న అభిప్రాయాన్ని కొందరు 
రాజమౌళి దగ్గర వ్యక్త పరుస్తున్నట్లు టాక్. 

అంతేకాదు కథకు సంబంధించి చివరి వరకు సస్పెన్స్ కొనసాగిస్తూ వెళ్ళిపోతే ఆ ఎత్తుగడ ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి మరొక విధంగా చెడు చేస్తుందని కొందరు ఇప్పటికే రాజమౌళికి గట్టి సూచనలు ఇవ్వడంతో జక్కన్న ఈమూవీకి సంబంధించి ఎంత వరకు కథను లీక్ చేయాలి అన్న ఆలోచనలలో ఉన్నట్లు సమాచారం. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ సెకండ్ షెడ్యూల్ మొదలు అయ్యేలోపు ఒక మీడియా సమావేశాన్ని నిర్వహించి ఈమూవీలో నటించే మొత్తం నటీనటుల పేర్లు ప్రకటించడమే కాకుండా ఈమూవీ కథ గురించి కొంత క్లారిటీ రాజమౌళి ఇచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: