గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అంటూ పవన్ రాజకీయ ప్రత్యర్ధులు పవన్ పై చేస్తున్న మాటల దాడి విషయంలో నాగబాబు తన మౌనం వీడాడు. పవన్ మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటే దానిని నాలుగు పెళ్ళిళ్ళుగా మార్చడం అన్యాయం అంటూ పవన్ ఇప్పటి వరకు రెండు సార్లు విడాకులు తీసుకోవడానికి వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి అంటూ కామెంట్స్ చేసాడు నాగబాబు. 

పవన్ సినిమా హీరో అవ్వకముందు చేసుకున్న మొదటి పెళ్ళికి సంబంధించిన అమ్మాయితో పవన్ కు భేదాభిప్రాయాలు వచ్చాయని అందువల్లనే వారిద్దరూ చట్టప్రకారం విడాకులు తీసుకున్న విషయాన్ని క్లారిటీ ఇచ్చాడు నాగబాబు. అయితే ఆతరువాత రేణు దేశాయ్ తో పరిచయం ఏర్పడి ఆతరువాత వారిద్దరు సహజీవనం చేస్తున్న సమయంలో తమ కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్ల పవన్ రేణు దేశాయ్ ని పెళ్లి చేసుకున్న విషయాన్ని వివరిస్తూ అయితే ఆతరువాత వారిద్దరూ ఎందుకు విదిపోయారో తనకు కూడ తెలియదు అంటూ కామెంట్స్ చేసాడు. 

అయితే ఆతరువాత పవన్ రష్యన్ అమ్మాయి అన్నాను ప్రేమించి పెళ్ళి చేసుకున్న తరువాత మాత్రమే పవన్ కుటుంబ జీవితంలో ప్రశాంతత ఏర్పడిందని నాగబాబు అభిప్రాయపడుతున్నాడు.  పవన్ భార్య అన్నా తమ మెగా కుటుంబ సభ్యులందరితోను చాల అభిమానంగా ఉంటూ తమ అందరితో కలిసిపోవడమే కాకుండా పవన్ కు ఇలాంటి మంచి అమ్మాయి ముందు దొరికి ఉంటే ఎంతో బాగుండేది అన్న అభిప్రాయం తనకు కలుగుతోంది అంటూ తన మరదలు అన్నా పై ప్రశంసలు కురిపించాడు నాగబాబు. 
 
పవన్ ‘జనసేన’ కు తమ మెగా కాంపౌండ్ నుండి పెద్దగా మద్దతు లేదని దీనికి కారణం ప్రస్తుతం మెగా కుటుంబ హీరోలు ఎవరి కెరియర్ కు సంబంధించి వారు బిజీగా ఉన్నారు అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు నాగబాబు. అంతేకాదు చరణ్ వరుణ్ తేజ్ లాంటి యంగ్ హీరోలు ఎన్నికల ప్రచారానికి వచ్చినా దానివల్ల వచ్చే ప్రయోజనాలు లేవనీ జనం పవన్ ను చూసి ఓట్లు వేస్తారు కానీ మెగా యంగ్ హీరోలను చూసి కాదు అంటూ రాబోతున్న ఎన్నికలలో మెగా యంగ్ హీరోలు ‘జనసేన’ ప్రచారానికి దూరంగా ఉండబోతున్న సంకేతాలు ఇస్తున్నాడు నాగబాబు..  


మరింత సమాచారం తెలుసుకోండి: