తమన్నా కు ఇప్పడూ ఇండస్ట్రీ లో అస్సలు టైం కలిసి రావటం లేదని చెప్పాలి. ఎంతో కష్ట పడి చేసినా , అందాలను ఆరబోసిన సినిమా లు హిట్ కావడం లేదు. తన లేటెస్ట్ మూవీ లో తమన్నా ను అందాల ఆరబోత తో తెగ వాడేశారంటా ... దర్శకులు ఏం చెప్పి ఒప్పిస్తున్నారో కానీ.. తమన్నా పాత్రల ఎంపికలో బ్లండర్స్ చేస్తోంది. ఆ సినిమాల కోసం ఆమె పడుతున్న కష్టమంతా వృథా అయిపోతోంది. రెండేళ్ల కిందట మిల్కీ బ్యూటీ ‘అభినేత్రి’ అనే సినిమా చేసింది. నటన పరంగా కష్టపడటమే కాక.. అందాలూ ఆరబోసింది. కానీ ఆమె కష్టం ఫలించలేదు.


నేను సెక్స్ గురించి మాట్లాడతా .. తప్పేముంది : తమన్నా ...!

ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఐతే అదైనా పర్వాలేదు కానీ.. ఈ ఏడాది ఆమె చేసిన ‘నా నువ్వే’ పరిస్థితి దారుణం. తమన్నా ఈ సినిమా గురించి ఎంతో చెప్పింది. దర్శకుడు జయేంద్ర గొప్ప అభిరుచి ఉన్నాడని.. తన కెరీర్లో నిలిచపోయే పాత్ర ఇచ్చాడని.. ఈ సినిమా తన కు చాలా పేరు తెస్తుందని అంది. తన వరకు ఆ సినిమా లో సిన్సియర్ ఎఫర్ట్ పెట్టింది. చాలా గ్లామరస్ గా కనిపించింది. కానీ ఏం లాభం.. సినిమా దారుణమైన ఫలితాన్నందుకుంది. 


తాజా గా ‘నెక్స్ట్ ఏంటి’ సినిమాలో నూ అంతే. దీని కోసం లుక్ మార్చుకుంది. రిఫ్రెషింగ్ గా కనిపించింది. గ్లామర్ షో చేసింది. నటన పరంగా నూ ఆకట్టుకుంది. కానీ ఇది కూడా తీవ్ర నిరాశనే మిగిల్చింది. సినిమా చూసిన వాళ్లంతా తమన్నాను పొగిడి.. సినిమా ను తిట్టిపోస్తున్నారు. పాపం తమన్నా అని జాలిపడుతున్నారు. ఇలాంటి సినిమాల కోసం ఆమె ఇంత కష్టపడటం.. ఇంతగా అందాల ప్రదర్శన చేయడం ఎందుకని అంటున్నారు. తన స్థాయికి తగని హీరోల పక్కన నటిస్తూ సిన్సియర్ ఎఫర్ట్ పెడుతున్న తమన్నాకు ఈ షాకు లు రుచించడం లేదు. వరుసగా తగులుతున్న ఎదురు దెబ్బలతో ఆమె కెరీర్ దాదాపుగా ముగింపు దశకు వచ్చేసినట్లు కనిపిస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: