ఘాజి సినిమాతో తన సత్తా చాటిన సంకల్ప్ రెడ్డి తన రెండో ప్రాజెక్ట్ గా మెగా హీరో వరుణ్ తేజ్ తో సినిమా చేస్తున్నాడు. స్పేస్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేశారు. స్పేస్ కాన్సెప్ట్ తో వచ్చిన ఇదవరకు సినిమాకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందని ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది.


ప్రపంచం మొత్తం కమ్యునికేషన్ వ్యవస్థను ప్రమాదంలోకి పడేసేలా ఓ శాటిలైట్ ప్రయోగం జరగడంతో ఆ ప్రమాదం నుండి కాపాడేందుకు అంతకుముందు అక్కడ పనిచేసి వెళ్లిన హీరో వచ్చి ఆ ప్రమాదం నుండి ఎలా కాపాడాడు అన్నది సినిమా కథ. సినిమా ట్రైలర్ చూస్తేనే సినిమా ఎంత అద్భుతంగా ఉండబోతుందో తెలుస్తుంది.


మెగా హీరోగా మూస థోరణిలో కాకుండా కొత్త ప్రయోగాలు చేస్తూ సినిమాలు చేస్తున్నాడు వరుణ్ తేజ్. ఫిదా, తొలిప్రేమ సినిమాల సక్సెస్ తో మంచి ఫాంలో ఉన్న వరుణ్ తేజ్ అంతరిక్షంతో కూడా తన హిట్ మేనియా కొనాగించాలని చూస్తున్నాడు. ట్రైలర్ చూస్తే కచ్చితంగా అంతరిక్షం కూడా హిట్ కొట్టేలానే ఉంది.


వరుణ్ తేజ్ సరసన అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రాజీవ్ రెడ్డి, క్రిష్, సాయి బాబు ఈ మూవీని నిర్మిస్తున్నారు. అంతరిక్షం ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 21న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: