నిన్న విడుదలైన వరుణ్ తేజ్ ‘అంతరిక్షం 9000 కెఎంపిహెచ్’ ట్రైలర్ కు విపరీతమైన స్పందన రావడంతో ఈమూవీ పై భారీ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా ఇండియాలోనే మొదటి ఒరిజినల్ స్పేస్ థ్రిల్లర్ గా చెప్పబడుతోంది. ఇలాంటి సైన్స్ ఫిక్షన్ సినిమాలను కూడ తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు అన్న విషయం నిన్న విడుదలైన ఈమూవీ ట్రైలర్ సక్సస్ మరొకసారి రుజువు చేసింది. 
విజువల్స్ హాలీవుడ్ రేంజిలో ఉన్నాయి
ఇండియన్ స్పేస్ సెంటర్ చేస్తున్న ఓ శాటిలైట్ ప్రయోగం ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థ తీవ్ర ప్రమాదంలో పడుతుంది. దీన్ని పరిష్కరించడంలో అంతకు ముందు అదే సెంటర్ లో పనిచేసి ఒక యువ సైన్ టిస్ట్ ఆ సమస్యను ఎలా పరిష్కరించాడు అన్న కథ చుట్టూ ఈమూవీ నడుస్తుంది. ఈమూవీలో వరుణ్ తేజ్ దేవ్ పాత్రలో యువ సైన్ టిస్ట్ గా కనిపించబోతున్నాడు. 
నీరా శాటిలైట్
ఈ ట్రైలర్ లాంచ్ కి సంబంధించి నిన్న జరిగిన కార్యక్రమంలో డైరెక్టర్ సుకుమార్ వరుణ్ తేజ్ గురించి తనకు రామ్ చరణ్ గతంలో చెప్పిన విషయాలను బయటపెట్టాడు. ‘రంగస్థలం’ షూటింగ్ జరుగుతున్న సందర్భంలో వరుణ్ తేజ్ ప్రస్తావన వచ్చినప్పుడు రామ్ చరణ్ తనతో మాట్లాడుతూ మంచి కథలను ఎంచుకోవడంలో వరుణ్ తేజ్ కు ఉన్న తెలివితేటలు తనకు కూడ లేవు అని అంటూ జోక్ చేసిన విషయాన్ని బయటపెట్టాడు సుకుమార్. 
హాలీవుడ్ టెక్నీషియన్స్
అంతేకాదు తాను నటించే ప్రతి సినిమాతో నటన విషయంలో బెటర్ అవుతున్న వరుణ్ తేజ్ టెక్నిక్ తాను కూడ నేర్చుకోవలసిన పరిస్థితి ఉంది అంటూ చరణ్ వరుణ్ తేజ్ పై కురిపించిన ప్రశంసలు బయటపెట్టాడు సుకుమార్. ఇదే సందర్భంలో సుకుమార్ మాట్లాడుతూ దర్శకుడు సంకల్ప్ రెడ్డి తెలివితేటాలు తనకు కూడ లేవు అని అంటూ అవకాసం కుదిరితే తాను కొద్దిరోజులు సంకల్ప రెడ్డి వద్ద అసిస్టెంట్ గా పనిచేయాలని తనకు అనిపిస్తోంది అంటూ సుకుమార్ చేసిన కామెంట్స్ నిన్నటి ఫంక్షన్ కు హైలెట్ గా మారాయి. ‘రంగస్థలం’ లాంటి భారీ సక్సస్ ను అందుకున్న తరువాత కూడ సుకుమార్ ఏమాత్రం గర్వపడకుండా ఎక్కడ ప్రతిభ ఉంటే దానిని గుర్తించడం సుకుమార్ సంస్కారానికి నిదర్శనం అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: